Sathyaraj Covid Positive : కట్టప్పకు కరోనా.. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సత్యరాజ్..!
Satyaraj Covid Positive : నటుడు సత్యరాజ్ కరోనా బారిన పడ్డారు. మహమ్మారి లక్షణాలు కనిపించగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న సత్యరాజ్ కు కరోనా నిర్ధారణ అయినట్లు సమాచారం. అప్పటికే పరిస్థితి తీవ్రంగా మారడంతో తన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే జనవరి 7 సాయంత్రం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన ఆరోగ్యంపై ఎలాంటి అప్ డేట్ రాలేదు.
తన అభిమాన నటుడు కరోనా బారిన పడ్డారన్న విషయం తెలుసుకున్న సత్యరాజ్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సత్యరాజ్ ఆరోగ్యంపై మరి కొద్ది సేపట్లోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ లో గత రెండు రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గత కొన్ని వారాలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు.

actor sathyaraj tested covid positive
తమిళ ఇండస్ట్రీ లో ఇప్పటికే కమల్, విక్రమ్, వడివేలు, హీరోయిన్ త్రిషతో పాటు టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు, హీరో విశ్వక్ సేన్, మంచు లక్ష్మీ మాత్రమే కాక పలువురు మహమ్మారి బారిన పడ్డారు. అయితే వీరిలో ఇప్పటికే పలువురు కోలుకోగా.. కోవిడ్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.