Actress Aamani : ఇన్నాళ్ల‌కి ఆమ‌ని త‌న భ‌ర్త నుండి ఎందుకు విడిపోయిందో తెలిసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actress Aamani : ఇన్నాళ్ల‌కి ఆమ‌ని త‌న భ‌ర్త నుండి ఎందుకు విడిపోయిందో తెలిసిందిగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2024,5:00 pm

Actress Aamani : సీనియ‌ర్ న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో సినిమాల‌లో మంచి మంచి పాత్ర‌లు పోషిస్తూ అల‌రించింది. కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, కమల్ హాసన్.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి అల‌రించింది. అయితే ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే… నిర్మాత ఖాజా మొయిద్దీన్ ను మతాంతర వివాహం చేసుకొని ఇక సినిమాల‌కి దూర‌మైంది. ఆమె భ‌ర్త‌కి సినిమాల‌లో న‌టించ‌డం ఇష్టం లేక‌పోవ‌డం వ‌ల‌న ఆమ‌ని కూడా సినిమాల‌కి దూరంగా ఉంటూ వచ్చింది. కొన్నాళ్ల‌కి ఆమె ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది.

మ‌రోవైపు నిర్మాత అయిన ఖాజా మొయిద్దీన్ ఒకానొక సమయంలో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అది అప్పట్లో సంచలనంగా మార‌గా, తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలన్నింటికీ ఆమె సమాధానం ఇచ్చింది. తన భర్త సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. మా మ‌ధ్య గొడ‌వ‌లు అనేవి పెద్ద‌గా లేవు. కాక‌పోతే న ఒక సినిమా తీసి బాగా నష్టపోయారు. కోట్లలో డబ్బులు కట్టాలి. ఆ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు అని ఆమ‌ని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కోట్లు అంటే కామన్ .. అప్పట్లో కోట్లు ఆంటే మాములు విషయం కాదు. అయితే దాని వ‌ల‌న మేము ఇద్ద‌రం విడిపోలేదు. ఫ్రెండ్లీగా విడిపోయాం. విడిగా ఉండాలనుకున్నాం.. విడిగా ఉంటున్నాం.

Actress Aamani ఇన్నాళ్ల‌కి ఆమ‌ని త‌న భ‌ర్త నుండి ఎందుకు విడిపోయిందో తెలిసిందిగా

Actress Aamani : ఇన్నాళ్ల‌కి ఆమ‌ని త‌న భ‌ర్త నుండి ఎందుకు విడిపోయిందో తెలిసిందిగా..!

నేను సినిమాల్లో మళ్లీ రావడం ఆయనకు ఇష్టం లేదు. నేను వస్తాను అని చెప్పి వచ్చేశాను. ఇక ఆయ‌న త‌న వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు నాకు రెండే ప్రపంచాలు. ఒకటి సినిమా.. ఇంకొకటి నా పిల్లలు. నేను షూటింగ్స్‌కి వేరే ప్రాంతాల‌కి వెళ్లిన‌ప్పుడు వారిని చాలా మిస్ అవుతానంటూ చెప్పుకొచ్చింది ఆమ‌ని. ప్రస్తుతం ఆమని ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది. గ‌తంలో ఆమ‌ని లైంగిక వేధింపుల గురించి కూడా కామెంట్ చేసింది. ఇండస్ట్రీలో అప్పుడప్పుడే కొన్ని కొత్త ప్రొడక్షన్ హౌజ్ లు పుట్టుకొస్తాయని, వాటి గురించి తెలియక ఆడిషన్ కి వెళ్తే బలవ్వడం ఖాయమని చెప్పుకొచ్చింది ఆమని.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది