Amani : ఆమనిని గెస్ట్ హౌజ్‌కి పిలిచి అలా చేశారా?
Amani : ఒకప్పుడు హీరోయిన్స్‌గా రాణించిన వారు ఆ తర్వాత సినిమాలకు దూరమై ఇప్పుడు తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా మరి అమ్మ, అక్క, వదిన క్యారెక్టర్స్‌తో ఆకట్టుకుంటున్నారు. కొందరు మాత్రం వైవాహిక జీవితంలోనే బిజీగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా అలరిస్తున్నారు. అయితే హీరోయిన్ గా రాణించిన సమయంలో బాపు, విశ్వనాథ్‌లాంటి లెజెండ్రీ దర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఆమని. ఇక ఇటీవల వచ్చిన చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి సినిమాలో నటించి ఆకట్టుకున్నారు ఆమని. మరోవైపు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. పలు టీవీ షోలకి జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది.
Amani : అలా జరిగిందా?
ఆమని సినిమా ఛాన్సుల కోసం ఎంత ప్రయత్నించినా… తండ్రి డిస్ట్రిబ్యూటర్ అయినా కూడా సినిమాల్లో మాత్రం ఆఫర్ లు అంత సులువుగా రాలేదట. కొంత మంది దర్శకులు ఆమని ఫోటో స్టిల్స్ చూసి ఒప్పుకుని బయట నేరుగా చూసి రిజెక్ట్ చేసేవారట. తాను సినిమాల్లో ప్రయత్నిస్తున్నప్పుడు ఓ ఆడిషన్ కు వెళ్లానని చెప్పింది. వాళ్లు రేపు గెస్ట్ హౌస్ కు రావాలని చెప్పారని.. అంతే కాకుండా సింగిల్ గా రమ్మన్నారట. వాళ్లు గెస్ట్ హౌస్‌కు రావాలి… సింగిల్‌గా రావాలని చెప్పడంతో తనకు విషయం అర్థం అయ్యిందని చెప్పింది. కాస్టింగ్ కౌచ్ విషయంలో ఆమని ఇలాంటి కామెంట్స్ చేసింది. ఆమని ఒక్కరే కాదు ఇండస్ట్రీలో చాలా మంది ఇలా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డవారే.
ఆమని బెంగుళూరులో జన్మించారు. నిజానికి ఆమని కుటుంబీకులు ఏపీకి చెందినవారే… ఆమని తండ్రి బెంగుళూరులో స్థిరపడ్డారు. అంతే కాకుండా ఆయన కూడా సినిమాల్లోనే పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలో ఆమని తండ్రి డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. ఆమనికి కూడా సినిమాలపై ఉన్న ఆసక్తితో చెన్నై వెళ్లి సినిమాల్లో ప్రయత్నించింది. మొదట్లో చాలా ఇబ్బందలు పడ్డప్పటికీ తర్వాత నిలదొక్కుకొని అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది..