Laya : మహేష్ బాబు సాంగ్‌కి దుమ్ము రేపిన లయ.. స్టెప్స్ భలే క్యూట్‌గా వేసిందిగా.. వీడియో !
Laya : మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా నుండి ఇటీవలే కళావతి అనే సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏదైనా ఫేమస్ అవ్వాలంటే సోషల్ మీడియా ఉంటే చాలు. అందుకే కళావతి పాటకు కూడా పాపులారిటీ తీసుకురావడం కళావతి స్టెప్ ఛాలెంజ్‌ను ప్రారంభించింది మూవీ టీమ్. ఈ ఛాలెంజ్‌లో సితార, కీర్తి సురేశ్‌తో పాటు తమన్ కూడా పాల్గొని అందరినీ మెప్పించాడు. వీరు మాత్రమే కాదు పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా కళావతి స్టెప్‌ను పర్ఫెక్ట్‌గా చేసి చూపించారు. ఇందులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఉన్నారు.
సీనియర్ నటి లయ.. సినిమాల్లో కనిపించి చాలాకాలమే అయ్యింది. పైగా ఒకప్పుడు లయ.. సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్‌గా ఉండేది కాదు. కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ.. తన ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. తాజాగా తన స్నేహితులతో కలిసి కళావతి పాటకు స్టెప్పులేసి.. ఫాలోవర్స్‌కు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసింది లయ. అచ్చం మహేష్ బాబు మాదిరిగా లయ వేసిన స్టెప్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ అమ్మడిపై నెటిజన్స్ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరిగి సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు.

Actress laya dance for mahesh Babu movie song
Laya : లయ అదరగొట్టేసిందిగా..!
సర్కారు వారి పాట చిత్రం విషయానికి వస్తే.. ఇక ఈ సినిమా మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.మహేష్ బాబు గత చిత్రాలు ‘నాని’, ’నిజం’, బ్రహ్మోత్సవం’, ’స్పైడర్’ మే నెలలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ’మహర్షి’ సినిమా మినహాయింపు అనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉండనే ఉంది. ఈ రకంగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో తొలిసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తే.. రాబోయే సినిమాలకు హెల్ప్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట.
View this post on Instagram