Shruti Haasan : పాపం.. శృతి హాస‌న్.. ప్రియుడిని వ‌దిలేసిన బాధ‌లో ఏం చెప్పిందంటే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Shruti Haasan : పాపం.. శృతి హాస‌న్.. ప్రియుడిని వ‌దిలేసిన బాధ‌లో ఏం చెప్పిందంటే..!

Shruti Haasan : క‌మ‌ల్ హాస‌న్ గారాల పట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ అమ్మ‌డు పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరీర్‌ను పాడు చేసింది. శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 May 2024,9:30 pm

ప్రధానాంశాలు:

  •  Shruti Haasan : పాపం.. శృతి హాస‌న్.. ప్రియుడిని వ‌దిలేసిన బాధ‌లో ఏం చెప్పిందంటే..!

Shruti Haasan : క‌మ‌ల్ హాస‌న్ గారాల పట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ అమ్మ‌డు పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరీర్‌ను పాడు చేసింది. శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ నుంచి శాంతను హజారికా ఫోటోలను డిలీట్ చేసింది. అంతే కాదు, అతడిని అన్ ఫాలో అవుతోంది. అతడు కూడా శృతిని అన్ ఫాలో అయ్యాడు. దీంతో వారిద్ద‌రు బ్రేక‌ప్ చెప్పుకున్నార‌ని అంద‌రు అనుకున్నారు.

Shruti Haasan ఎంత క‌ష్టం వ‌చ్చింది..

ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఛాటింగ్‌లో తాను సింగిల్‌గా ఉన్నట్టు చెప్పి బ్రేక‌ప్‌ని క‌న్‌ఫాం చేసింది. అయితే బ్రేక‌ప్ త‌ర్వాత శృతి హాస‌న్ ఏం చేస్తుంది, ఎలా బాధ‌ప‌డుతుంది అని అంద‌రు ఆలోచ‌న‌లు చేశారు. ఈ స‌మ‌యంలో శృతి హాస‌న్ త‌న పోస్ట్‌లో నా డోర్స్‌ మూసేశాను. కీ అంటేనే అసహ్యం’ అని పేర్కొన్నారు. మరి మాజీ ప్రియుడిని మర్చిపోలేకపోతుందో ఏమో కానీ ట్రాజెడీ సాంగ్స్ పాడుకుంటుంది. తన హృదయపు తలుపులు మూసేసిందట. ఇక ఎవరి కోసం తెరిచేది లేదని అర్థం వచ్చేలా ఇంగ్లీష్ సాంగ్స్ పాడుకుంటుంది. శృతి హాసన్ వీడియో వైరల్ అవుతుంది.

Shruti Haasan పాపం శృతి హాస‌న్ ప్రియుడిని వ‌దిలేసిన బాధ‌లో ఏం చెప్పిందంటే

Shruti Haasan : పాపం.. శృతి హాస‌న్.. ప్రియుడిని వ‌దిలేసిన బాధ‌లో ఏం చెప్పిందంటే..!

ఇప్పటికే రెండుసార్లు ప్రేమ వ్యవహారంలో ఫెయిలైన శృతిహాసన్‌ తాజాగా శాంతను హజారికా అనే టాటూ కళాకారుడితో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె ఇటువంటి పోస్టు పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. తాను ప్రస్తుతం సింగిల్‌నే అని.. మింగిల్‌ అవ్వాలనుకోవడం లేదని తాజాగా ఈ అమ్మడు చేసిన పోస్టు చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. శృతి హాస‌న్ గ‌తంలో హీరో సిద్ధార్థ్,ధనుష్,నాగ చైతన్యలతో పాటు, ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా వంటి వారితో ప్రేమాయ‌ణం న‌డిపింది. ఇక ఇప్పుడు శృతి హాస‌న్ త‌న కెరీర్‌పై ప్ర‌త్యేక ధృష్టి పెట్టిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది