Prabhas : మారుతి పక్కా ఫ్లాప్.. ఇప్పుడేమంటావు ప్రభాస్?
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమా రావాల్సి ఉంది. ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ ప్రభాస్ తో సినిమా విషయం నిజమే అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. డార్లింగ్.. బుజ్జిగాడు తరహా సినిమాను చేయాలని భావిస్తున్నాను. అందుకు సంబంధించిన చర్చలు మొదటి దశలో ఉన్నాయి. ప్రభాస్ కు స్టోరీ లైన్ వినిపించాను అనే విషయాన్ని కూడా మారుతి చాలా స్పష్టంగా చెప్పాడు.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా ప్లాప్ గా నిలిచింది. సినిమాకు కాస్త పర్వాలేదు అన్నట్లుగా టాక్ వచ్చినా కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సినిమా దారుణమైన వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వారం కొత్త సినిమాలు వస్తున్నాయి. దాంతో పక్కా కమర్షియల్ సినిమా లు నిలవడం అసాధ్యం అన్నట్లుగా ఉంది. వచ్చే వారంకు పూర్తిగా థియేటర్ల నుండి పక్కా కమర్సియల్ కనిపించకుండా పోతుంది. దాంతో సినిమాకు కమర్షియల్ గా పెద్ద నష్టం తప్పదేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

after maruthi pakka commercial movie release what is prabhas raja deluxe movie update
ఈ సమయంలో రాజా డీలక్స్ పరిస్థితి ఏంటీ అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మారుతి పక్కా కమర్షియల్ సినిమా ను బట్టి తన సినిమాను ప్రభాస్ మొదలు పెట్టాలని భావిస్తే కనుక కచ్చితంగా రాజా డీలక్స్ సినిమా ఉండటం అనుమానమే అన్నట్లుగా ఉంది. కాని ప్రభాస్ ఒక సినిమా పలితాన్ని బట్టి తన నిర్ణయాన్ని మార్చుకుంటాడని ఏ ఒక్కరు భావించడం లేదు. కనుక రాజా డీలక్స్ విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని తీసుకు వస్తారేమో తప్ప క్యాన్సిల్ చేయరు అంటున్నారు. ఇదే సమయంలో చిరంజీవితో సినిమాను కూడా మారుతి చేయబోతున్నాడు. అది కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.