Mani Ratnam : అంతమంది అగ్ర తారలున్నా మణిరత్నం సినిమాను పట్టించుకోవడం లేదే..?

Advertisement

Mani Ratnam : అంతమంది అగ్ర తారలున్నా మణిరత్నం సినిమాను పట్టించుకోవడం లేదే..? అంటూ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి టాక్ వినిపిస్తోంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మణిరత్నం మళ్లీ పెద్ద ప్రయోగం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కెరీర్ ప్రారంభం నుంచి చేస్తున్న ప్రతీ సినిమా పెద్ద ప్రయోగమే. బలమైన కథ కథనాలతో సినిమాలు తీస్తుంటారు. అయితే, కొన్ని సినిమాలు ఎందుకనో ఆశించిన సక్సెస్ సాధించడం లేదు. కానీ, జీవితకాలం మణిరత్నం సినిమా చెప్పుకునేలా ఉండటం విశేషం.

బొంబాయి, రోజా, గీతాంజలి లాంటి సినిమాలు ప్రేక్షకులకు ఆల్ టైం ఫేవరేట్ సినిమాలు. ఇక మణిరత్నం గత చిత్రం విలన్ తెలుగు తమిళ హిందీ భాషలలో రిలీజైంది. కానీ, డిజాస్టర్‌గా మిగిలింది. దాని తర్వాత మొదలుపెట్టిన సినిమానే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. అత్యంత భారీ
తారాగణంతో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా పార్ట్ 1ని గత ఏడాదే రిలీజ్ చేయాలని మణిరత్నం ప్లాన్ చేశారు. కానీ, భారీ తారాగణం, కరోనా కారణంగా అందరి డేట్స్ తారుమారవడం..ఇతర కారణాల వల్ల సినిమా షూటింగ్ దశలో ఆగిపోయింది. ఎట్టకేలకు ఫస్ట్ పార్ట్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే, విడుదల తేదీని కన్‌ఫర్మ్ చేశారు. ఇప్పటికే, చిత్ర బృందం పీఎస్ 1 ని సెప్టెంబర్ 30న విడుదల అని ప్రకటించారు.

Advertisement
Netizens comments will happen to Mani Ratnam a huge project
Netizens comments will happen to Mani Ratnam a huge project

Mani Ratnam : మణిరత్నం పెట్టుకున్న ఆశలు ఏమవుతాయో..?

ఇక విడుదల తేది దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను జోరుగా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని ప్రధాన తారాగణం ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు. ఈపోస్టర్స్‌కి పెద్దగా రెస్పాన్ రావడం లేదు. విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి, సూర్య, కార్తి, త్రిష, జయం రవి లాంటి అగ్ర తారలున్నా సినిమాపై ఎందుకనో ఏర్పడాల్సిన బజ్ రావడం లేదు. దీంతో ఇంత భారీ ప్రాజెక్ట్ పై మణిరత్నం పెట్టుకున్న ఆశలు ఏమవుతాయో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి థియేట్రికల్ ట్రైలర్ రిలీజైన తర్వాత
ఏదన్నా అంచనాలు పెరుగుతాయేమో.

Advertisement
Advertisement