Akira Nandan : తండ్రి సినిమాతో కాదు, పెద్దనాన్న సినిమాతో అకీరా ఇండస్ట్రీ ఎంట్రీ..!
Akira Nandan : రేణూ దేశాయ్ తనయుడు అకీరా నందన్ ఇండస్ట్రీ గురించి కొన్నాళ్లుగా అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై క్లారిటీ అయితే రావడం లేదు. ఇప్పుడు చిరంజీవి సినిమాతో అకీరా ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే చిత్రంలో నటిస్తున్నారు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం […]
ప్రధానాంశాలు:
Akira Nandan : తండ్రి సినిమాతో కాదు, పెద్దనాన్న సినిమాతో అకీరా ఇండస్ట్రీ ఎంట్రీ..!
Akira Nandan : రేణూ దేశాయ్ తనయుడు అకీరా నందన్ ఇండస్ట్రీ గురించి కొన్నాళ్లుగా అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై క్లారిటీ అయితే రావడం లేదు. ఇప్పుడు చిరంజీవి సినిమాతో అకీరా ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే చిత్రంలో నటిస్తున్నారు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని హై రేంజ్‌లో తీస్తున్నారు. అంతేకాదు, దీన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
Akira Nandan గెస్ట్ రోల్…
ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదలకు సిద్ధమవుతుంది.దాదాపు 100% షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి.మరికొంత భాగమే షూటింగ్ పనులు ఉన్నాయని తెలుస్తోంది .అయితే ఈ సినిమాలో ఎంతోమంది ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఇకపోతే ఈ సినిమాలో ఒక గెస్ట్ పాత్రలో ఆకీరా కూడా కనిపించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ వండర్‌గా రూపొందుతోన్న ‘విశ్వంభర’ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకున్నారు.
స్పెషల్ రోల్ కోసం మెగా ఫ్యామిలీకి చెందిన అకీరా నందన్ ని ఎంపిక చేశారనే వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.త్వరలోనే ఈ లిటిల్ ప్రిన్స్ షూట్‌లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు. ‘మనం’ సినిమాలో అఖిల్‌ను చూపించినట్లు ఓ సన్నివేశంలో మాత్రం అకీరా కనిపిస్తాడని సమాచారం.ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి – మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘విశ్వంభర’ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.