Allu Arjun : పుష్ప సినిమాపై బిగ్ అప్ డేట్ ఇచ్చిన అల్లు అర్జున్..!! | The Telugu News

Allu Arjun : పుష్ప సినిమాపై బిగ్ అప్ డేట్ ఇచ్చిన అల్లు అర్జున్..!!

Allu Arjun : రీసెంట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ మంగళవారం ‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో ‘ పుష్ప 2 ‘ సినిమా గురించి మాట్లాడుతూ బిగ్ అప్డేట్ ఇచ్చారు. పుష్ప 2 సినిమా లో గంగమ్మ తల్లి జాతర పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ప్రస్తుతం దానికి సంబంధించిన షూట్ ను రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నాం అని, ఆ […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 November 2023,5:00 pm

Allu Arjun : రీసెంట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ మంగళవారం ‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో ‘ పుష్ప 2 ‘ సినిమా గురించి మాట్లాడుతూ బిగ్ అప్డేట్ ఇచ్చారు. పుష్ప 2 సినిమా లో గంగమ్మ తల్లి జాతర పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ప్రస్తుతం దానికి సంబంధించిన షూట్ ను రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నాం అని, ఆ సెట్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చాను అని, చేతులకు ఉన్న పారాణి ఇంకా ఆరనే లేదు చూడండి అని అల్లు అర్జున్ తన చేతులకు ఉన్న పారాణిని చూపించారు. ఈ సీన్ మిమ్మల్ని చాలా బాగా అలరిస్తుంది అని చెప్పాడు.

ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది అని అన్నారు. ఇక మంగళవారం సినిమాలు నిర్మించిన స్వాతి తనకు ఫ్రెండ్ అని, ఆ సినిమా గురించి తన వద్ద చర్చించారని తనకు సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ చెప్పారట. ప్రస్తుతం ఈవెంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత క్రేజ్ ను సంపాదించిందో అందరికీ తెలుసు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాతో రీసెంట్ గా అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడి అవార్డును దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే ‘ పుష్ప 2 ‘ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సుకుమార్, అల్లు అర్జున్ కూడా ఈ సినిమా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. పుష్పకు మించి పుష్ప 2 ఉంటుందని సినిమా టీమ్ చెబుతూనే, దానికి హింట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా అలరించడంతోపాటు పుష్ప రాజ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అన్నది కూడా ఈ టీజర్ లో చూపించారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఇచ్చిన అప్డేట్స్ తో పుష్ప సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...