Pushpa 2 : పుష్ప 2 డైలాగ్ లీక్ చేసిన అల్లూ అర్జున్ – తల పట్టుకున్న సుకుమార్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa 2 : పుష్ప 2 డైలాగ్ లీక్ చేసిన అల్లూ అర్జున్ – తల పట్టుకున్న సుకుమార్ !

 Authored By aruna | The Telugu News | Updated on :22 July 2023,10:00 am

Pushpa 2 : ఇటీవల విడుదలైన ‘ బేబీ ‘ సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కనివిని ఎరుగని రేంజ్ లో వసూళ్లను రాబడుతుంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది. ఈ రేంజ్ లో వసూళ్లు ఈమధ్య స్టార్ హీరోల సినిమాలకు కూడా రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదల కు ముందు నుండే ట్రైలర్ మరియు పాటలతో ఆకట్టుకున్న ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే మూడింతలకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఇప్పటికీ ఈ సినిమా అదే రేంజ్ లో దూసుకెళ్తుంది ఈ క్రమంలోనే హైదరాబాదులో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. దీనికి గెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ సాధారణంగా నన్ను ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కానీ సక్సెస్ ఈవెంట్ కి కానీ పిలిచినప్పుడు రెండు మూడు గంటలు వేస్ట్ అయిపోతాయి అని అనుకుంటూ ఉంటాను. కానీ ఈ సినిమా సక్సెస్ మీట్ కి పిలిచినప్పుడు ఎందుకో నాకు మనస్ఫూర్తిగా వచ్చి మాట్లాడాలి అనిపించింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్లంతా ఏ స్థాయి నుండి వచ్చారో ఇప్పుడు ఎలా ఉన్నారో అని నేను దగ్గరుండి చూశాను.

Allu Arjun reveal Pushpa 2 dialogue

Allu Arjun reveal Pushpa 2 dialogue

సాయి రాజేష్ గారు గతంలో స్పూఫ్ సినిమాలు చేస్తుండడం చూసిన కొంతమంది మేకర్స్ ఆయనతో సినిమా చేయాలంటే భయపడేవారు ఆయనతో సినిమాలేంటి టైం వేస్ట్ అని వెనక్కి పంపేవారు. ఈరోజు ఆయన తీసిన సినిమాలు చూస్తే ఆరోజు ఆయన్ని అవమానించిన వాళ్లే నేడు అడ్వాన్స్ పట్టుకొని నాతో సినిమా చేయి అనే రేంజ్ సినిమాని అందించారు. మాకు చాలా గర్వంగా ఉంది అతనిని చూస్తుంటే అని చెప్పుకొచ్చారు. ఇక చివర్లో అల్లు అర్జున్ నుండి పుష్ప టు డైలాగ్ వచ్చింది. ఈ సినిమా పేరు ‘ పుష్ప 2 ది రూల్ ‘ .. కానీ ఒకటే చెప్తున్నాను ఇక్కడ జరిగేది మొత్తం ఒక రూల్ ప్రకారం జరుగుతున్నాది.. అదే పుష్ప గాడి రూల్ అంటూ అల్లు అర్జున్ డైలాగ్ లీక్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ డైలాగ్ వైరల్ అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది