Allu Arjun : చిరంజీవిని వెనక్కి నెడుతూ.. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జునే నెంబర్ వన్..!
Allu Arjun : 2021వ సంవత్సరానికి గాను “పుష్ప” సినిమాకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్ వశమైన సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ క్రమంలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్ కి వరించింది. ఇదే అవార్డుకి అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్, చరణ్, సూర్య, జోజి జార్జి పోటీపడ్డారు. కానీ అల్లు అర్జున్ సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో 69 ఏళ్ల భారతీయ చలన చిత్ర రంగంలో తొలి తెలుగు హీరోగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. 2021లో వచ్చిన “పుష్ప” సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా నేపథ్యంలో మొట్టమొదటిసారి బన్నీ మరియు సుకుమార్ తీసిన ఈ సినిమా భారీ లాభాలు సాధించి పెట్టింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు కేవలం తెలుగులో సత్తా చాటడం జరిగింది. ఈ క్రమంలో “పుష్ప”తో..పాన్ ఇండియా నేపథ్యంలో చేసిన ప్రయోగం మొట్టమొదటిసారే ప్రపంచ స్థాయిలో విజయం సాధించడంతో అప్పట్లోనే “పుష్ప” టీం సంబరాలు చేసుకోవడం జరిగింది. “పుష్ప” సినిమాలో పాటలు ఇంకా డైలాగులు.. డాన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తగ్గేదేలే అనే డైలాగ్..తో పాటు శ్రీవల్లి సాంగ్ లో బన్నీ వేసిన స్టెప్, నా సామి బంగారు సామి.. పాటలో హీరోయిన్ రష్మిక మందన వేసిన స్టెప్స్ ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ సృష్టించటం జరిగింది.
ఈ క్రమంలో ఈ సినిమా గాను బన్నీకి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంతో.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. బన్నీని గట్టిగా కౌగిలించుకొని కన్నీరు పెట్టుకున్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో మొట్టమొదటిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు బన్నీ అందుకుంటూ ఉండటంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రాజకీయ నేతలు.. అభినందనలు తెలియజేస్తున్నారు.