Allu Arjun : అల్లు అర్జున్‌ జొమాటో యాడ్‌ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే షాక్‌ అవుతారు

Advertisement

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం జోమాటో ఆన్ లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో బ్రాండ్ అంబాసిడర్‌ విషయం లో మహేష్ బాబు తర్వాత మరెవరైనా. ఒకానొక సమయంలో మహేష్ బాబు 10 నుండి 15 కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ నాలుగైదు కంపెనీల కంటే ఎక్కువ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. మొత్తానికి అల్లు అర్జున్ సినిమాలు తోనే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా బిజీగా ఉన్నాడని చెప్పుకోవాలి. ఆ మధ్య జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ తో ఒప్పందం కుదుర్చుకున్న అల్లు అర్జున్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.

Advertisement

మహేష్ బాబు సుదీర్ఘ కాలంగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు, ఆయన ఎప్పుడూ తీసుకోనంత రెమ్యూనరేషన్ అల్లు అర్జున్ జొమాటో కోసం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అందుకే సౌత్ ఇండియా జొమాటో బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడంతో ఏకంగా 15 కోట్ల రూపాయల
రెమ్యూనరేషన్ ని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. తదుపరి సంవత్సరానికి ఒప్పందం కంటిన్యూ చేస్తే మరో 5 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నారట. అంటే జొమాటో రెండో సంవత్సరం బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తే 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అల్లు అర్జున్ సొంతం కాబోతుంది.

Advertisement
Allu Arjun zomato add remuneration interesting news
Allu Arjun zomato add remuneration interesting news

ఈ స్థాయిలో బాలీవుడ్ హీరోలు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ స్థాయి అదే కనుక తాను కూడా అదే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటా అన్నట్లుగా అల్లు అర్జున్ కంపెనీలతో చెబుతున్నాడట. మొత్తానికి అల్లు అర్జున్ కి ఉన్న స్టార్‌ డమ్‌ నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ సరైనదే అని అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన అభిమానులు పుష్పా 2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కి పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement