Amala Paul : తెలుగు సినిమాల్లో హీరోయిన్స్‌ని తీసుకునేది అందుకే.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమలాపాల్…!
Amala Paul : అమలాపాల్.. ఈ అమ్మడి పేరు గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019లో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అమలాపాల్ తాజాగా ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అమలాపాల్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. 17ఏళ్ల వయసులో నీలతామర అనే మలయాళ చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసింది. 2010లో తమిళ సినిమా మైనాతో సూపర్ హిట్ అందుకుంది.
అయితే తాను కెరీర్ ఆరంభంలోనే బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. తాజాగా అమలాపాల్ సంచలన కామెంట్స్ చేసింది. తాను తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందన్న విషయం తనకు అర్థమైందన్నారు. ఆ కుటుంబాలే చిత్ర పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్న విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. వారు తీసే సినిమాలు కూడా భిన్నంగా ఉండేవని, వారి ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారని అన్నారు. ఆ సినిమాలు చాలా కమర్షియల్‌గా ఉండేవని, అందుకనే తాను తెలుగు ఇండస్ట్రీకి దగ్గర కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
Amala Paul : అమలా షాకింగ్ కామెంట్స్..
తెలుగులో అమలాపాల్ నాయక్, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాల్లో నటించారు. చివరిగా పిట్టకథలులో నటించారు. తాజాగా అమలాపాల్ సినిమా కడవర్ ఓటీటీలో విడుదలైంది.అమలాపాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎవరిని ఉద్దేశించి, ఏ కుటుంబాలను ఉద్దేశించి చేసిందనే విషయం స్పష్టంగానే అర్థమవుతోందని,ఇది అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అమలాపాల్ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదని, ఉన్న విషయాన్ని ఆమె స్పష్టంగానే చెప్పిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అమలా పాల్ వ్యాఖ్యలు ఇంకెంత చర్చనీయాంశంగా మారుతాయో చూడాలి మరి..!