Allu Arjun : పుష్ప సాంగ్‌లో బ‌న్నీ డ్యాన్స్ సీక్రెట్ రివీల్ చేసిన అమితాబ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : పుష్ప సాంగ్‌లో బ‌న్నీ డ్యాన్స్ సీక్రెట్ రివీల్ చేసిన అమితాబ్

 Authored By sandeep | The Telugu News | Updated on :12 August 2022,3:20 pm

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీఫుల్ భామ ర‌ష్మిక మందాన ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన చిత్రం పుష్ప‌. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ పుష్ప రికార్డును చెరపలేదు. ఇక ఈ సినిమాలోని డైలాగులు పాటలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాలో పాటలు మిలియన్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాను షేక్ చేశాయని చెప్పాలి. సమంత నటించిన ఐటమ్ సాంగ్ ఉ అంటావా మామ ఊ…ఊ అంటావా మామ అనే పాటకివచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. రష్మిక నటించిన శ్రీ వల్లి అనే సాంగ్ కూడా సరికొత్త రికార్డులను సృష్టించి ప్రేక్షకులను సందడి చేసింది.ఇదిలా ఉండగా తాజాగా శ్రీవల్లి పాటకి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Allu Arjun : అస‌లు విష‌యం ఇదే..

ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 14 సీజన్ ప్రారంభం అయింది. ఈ షోలో పుష్ప గురించి ప్రశ్న వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్.. అల్లు అర్జున్ వేసిన స్టెప్పు గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. కొరియోగ్రఫీలో భాగంగా బన్నీ ఇలా డ్యాన్స్ చేశారా లేక మిస్టేక్ జరిగిందా అని అడిగాను. అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే అనుకోకుండా చెప్పు జారింది, అది సుకుమార్‌కి న‌చ్చ‌డంతో అలానే కొన‌సాగించార‌ని అమితాబ్ అన్నారు. అల్లు అర్జున్ పొరపాటుగా చేసిన స్టెప్ అదిరిపోయే స్టెప్పులాగా మారిపోయింది. పలు సందర్భాల్లో సెలెబ్రిటీలు పొరపాటుగా చేసిన అంశాలు వైరల్ అయిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు శ్రీవ‌ల్లి విష‌యంలో ఇది జరిగింది.

Amitabh About Allu Arjun Dance In Pushpa Song

Amitabh About Allu Arjun Dance In Pushpa Song

‘చూపే బంగారమాయనే శ్రీవల్లి…మాటే మాణిక్యమాయనే శ్రీవల్లి…చూపే బంగారమాయనే శ్రీవల్లి… నవ్వే నవరత్నమాయనే’ అనే పల్లవితో సాగి సంగీత ప్రియులను ఆకట్టుకుంది ఈ సాంగ్. పల్లెటూరి యువకుడిగా అల్లు అర్జున్‌ సాంగ్‌లో పూర్తిగా ఒదిగిపోయి కనిపించాడు. పల్లెటూరి యువతిగా రష్మిక లుక్స్‌ ఇప్పటికే ఆకట్టుకోగా.. ఈ సాంగ్‌లో మరింత అమాయకంగా, అందంగా కనిపించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తుండగా.. మొదటి భాగం డిసెంబర్‌ 17న విడుదల అయింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది