Ananya Pandey : విజయ్ దేవరకొండ నేను సెట్‌లో ఎంజాయ్ చేశాం.. వాటి గురించి మాట్లాడుకున్నాం అనన్య పాండే
Ananya Pandey : బాలీవుడ్ నటుడు చుంకీ పాండే అందాల కూతురు అనన్య పాండే. ఈ అమ్మడు లైగర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది. వరుస చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. పాత్ర ప్రాధాన్యతను బట్టి అవసరమైతే బోల్డ్ సీన్లలోనూ నటిస్తోంది. ఇటీవల ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, రొమాంటిక్ డ్రామా గెహ్రైయాన్ తో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకుణె , సిద్దాంత్ చతుర్వేదితో కలిసి నటించింది. ఈ చిత్రంలో కొన్ని బోల్డ్ సీన్లలోనూ నటించి ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ఇక ‘లైగర్’లో హీరోయిన్ గా నటించింది.
ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీతో తొలిసారి తెలుగు ఆడియెన్స్ కు అనన్య పాండే పరిచయం కానుండగా, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.సీక్రెట్స్ రివీల్..విజయ్ దేవరకొండను పొగడ్తలతో ముంచెత్తిన ఈ భామ, విజయ్‌ది చాలా దయాగుణమని, అతను చాలా మంచి వ్యక్తి అని పేర్కొంది. ‘మేమిద్దరం సెట్‌లో సరదాగా ఉండేవాళ్లం. అమెరికాలో లైగర్ షూటింగ్ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చింది. పలు విషయాల గురించి ఇద్దరం మాట్లాడుకునే వాళ్లం అని అనన్య చెప్పుకొచ్చింది.

ananya pandey intresting comments on Vijay Devarakonda
కాగా ఈ చిత్రంలో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరు ఈ సారి బాక్సాఫీస్‌ని షేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి నటిస్తున్నాడు. ఈ మూవీ కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఒకవైపు షూటింగ్ చేసుకుంటూనే మరోవైపు లొకేషన్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు… మరోవైపు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లోనే ‘జనగణమన’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. మొత్తానికి రెండేళ్ల గ్యాప్‌ను భర్తీ చేసేలా వరుస సినిమాలతో బిజీ అయ్యాడు.విజయ్ దేవరకొండకి లైగర్ సినిమా మంచి హిట్ అందిస్తే అటు పూరీ, ఇటు విజయ్ ఇద్దరు తగ్గేదే లే అంటూ దూసుకుపోవడం ఖాయం.