అందుకే అవకాశాలు రావడం లేదట.. క్యాస్టింగ్ కౌచ్‌పై అనసూయ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, మీటూ వంటివి ఉంటాయని అందరి తెలిసిందే. మామూలుగా ప్రతీ రంగంలోనూ అలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. కానీ సినిమా రంగంపైనే అందరి దృష్టి ఉంటుంది. కాబట్టి క్యాస్టింగ్ కౌచ్, మీటూ అందరూ సినీ ఇండస్ట్రీ వైపు చూస్తుంటారు. తాజాగా అనసూయ కొన్ని కామెంట్లు చేసింది. ఆ మాటలను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. అందులో ఎన్నో అర్థాలు బయటకు కనిపిస్తాయి.
తాజాగా అనసూయ ఓ మీడియాతో మాట్లాడుతూ తనకు అవకాశాలు చేజారిపోవడంపై స్పందించింది. సినిమా రంగంలో బయటకు తెలియని ఫేవరెటిజం చాలా ఉంటుందని చెప్పుకొచ్చింది. షూటింగ్ పేకప్ చెప్పిన తర్వాత చేసే నెట్‌వర్క్ ప్రభావం కూడా ఎక్కువే అని పరోక్షంగా క్యాస్టింగ్ కౌచ్, మీటూ గురించి చెప్పినట్టు కనిపిస్తోంది. ఆ నెట్‌వర్క్ అంటే అనసూయ దృష్టిలో మీటూ అయి ఉంటుందని తెలుస్తోంది. చాలా సందర్భాలలో పాత్రలు చేతికి వచ్చినట్లు వచ్చి చేజారిపోతాయని తనకు జరిగిన ఓ అనుభవాన్ని చెప్పేసింది.
కోవిడ్ సమయంలో నేను నాలుగు పెద్ద సినిమాల్లో పాత్రలు కోల్పోయానని చెప్పుకొచ్చింది. ఈ నాలుగు సినిమాలకు ఆడిషన్ చేసినప్పుడు డైరక్టర్లు చాలా మెచ్చుకున్నారని తెలిపింది. ఒకరైతే కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని గొప్పగానే బిల్డప్ ఇచ్చుకుంది. ఆడిషన్లు అయిన కొన్ని రోజుల తర్వాత ఆ పాత్రలను వేరే వాళ్లకు ఇచ్చారని తెలిసిందట.. ఆ పాత్రలు చేసిన వాళ్లు తన కన్నా గొప్పగా నటించేవారు కారని తనది తాను గొప్పలకు పోయింది. అయినా కూడా అవకాశం వారికే దక్కిందంటూ.. పరోక్షంగా మీటూ, క్యాస్టింగ్ కౌచ్ గురించి అనసూయ చెప్పుకొచ్చింది.