Anasuya : శ్రీలంకలో అనసూయ.. అసలు విషయం చెప్పిన జబర్దస్త్ శ్రీ సత్య | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : శ్రీలంకలో అనసూయ.. అసలు విషయం చెప్పిన జబర్దస్త్ శ్రీ సత్య

Anasuya : జబర్దస్త్ బ్యూటీగా శ్రీ సత్యకు మంచి పేరు వచ్చింది. అయితే ఆమె కేవలం చమ్మక్ చంద్ర టీంలోనే కనిపించేది. చమ్మక్ చంద్ర భార్యగానే ఎక్కువగా నటించేది. చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి బయటకు రావడంతో.. అతని వెంటే బయటకు వెళ్లిపోయింది. చమ్మక్ చంద్ర అదిరింది, బొమ్మ అదిరింది షోలో చేశాడు. అక్కడా అతనితో పాటు కలిసి స్కిట్లు వేసింది. ఇక కామెడీ స్టార్స్ షోలోనూ చమ్మక్ చంద్రతో కలిసి అందరినీ నవ్వించే ప్రయత్నం చేసింది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 September 2022,1:30 pm

Anasuya : జబర్దస్త్ బ్యూటీగా శ్రీ సత్యకు మంచి పేరు వచ్చింది. అయితే ఆమె కేవలం చమ్మక్ చంద్ర టీంలోనే కనిపించేది. చమ్మక్ చంద్ర భార్యగానే ఎక్కువగా నటించేది. చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి బయటకు రావడంతో.. అతని వెంటే బయటకు వెళ్లిపోయింది. చమ్మక్ చంద్ర అదిరింది, బొమ్మ అదిరింది షోలో చేశాడు. అక్కడా అతనితో పాటు కలిసి స్కిట్లు వేసింది. ఇక కామెడీ స్టార్స్ షోలోనూ చమ్మక్ చంద్రతో కలిసి అందరినీ నవ్వించే ప్రయత్నం చేసింది. చమ్మక్ చంద్ర తన గురువు అని, తన గురువు వెళ్లడంతోనే తాను కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానంటూ సత్య శ్రీ చెబుతూ ఉంటుంది.

అయితే శ్రీ సత్య ఇప్పుడు స్పెషల్ ఈవెంట్లు, షోలు చేస్తూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో మరింత సందడి చేస్తోంది. సినిమాల్లోనూ సత్య ట్రై చేస్తోన్నట్టుంది. ఇక సత్య ఫోటో షూట్లు, నెట్టింట్లో షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో మొదటి సారిగా తాను హోస్ట్ చేసిన షో గురించి చెప్పింది. శ్రీలంకలో ఓ ఈవెంట్ జరిగిందట. తాను మొదటి సారిగా ఆ షోను హోస్ట్ చేసిందట. ఈ ఈవెంట్‌లో అనసూయ మెరిసిందని చెప్పుకొచ్చింది. ఇక అనసూయతో కలిసి దిగిన ఫోటోలను శ్రీ సత్య షేర్ చేసింది.

Anasuya At Srilanka Event And Sri Satya Hosts The Event

Anasuya At Srilanka Event And Sri Satya Hosts The Event

ఈ ఈవెంట్‌లో అనసూయ తన భర్త సుశాంక్‌తో పాటుగా కనిపించింది. అంతేకాకుండా ఈ ఈవెంట్‌లో కండక్టర్ ఝాన్సీ కూడా కనిపిస్తోంది. మళ్లీ అదే పల్సర్ బైక్ స్టెప్పులు, అదే క్యాస్టూమ్‌తో కనిపిస్తోంది. ఇక శ్రీలంకలోనూ ఝాన్సీ అవే స్టెప్పులు వేసినట్టుంది. మొత్తానికి ఈ ఫోటోలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ సత్య, అనసూయ ఇలా ఇద్దరూ చీరకట్టులో ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించారు. ప్రస్తుతం సత్యను అలా చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. అద్భుతంగా ఉన్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది