Anasuya Bharadwaj : నా ఒళ్లు.. నా ఇష్టం మధ్యలో మీకేంటి.. అనసూయ సంచలన వ్యాఖ్యలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya Bharadwaj : నా ఒళ్లు.. నా ఇష్టం మధ్యలో మీకేంటి.. అనసూయ సంచలన వ్యాఖ్యలు..!

 Authored By tech | The Telugu News | Updated on :12 March 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Anasuya Bharadwaj : నా ఒళ్లు.. నా ఇష్టం మధ్యలో మీకేంటి.. అనసూయ సంచలన వ్యాఖ్యలు..!

Anasuya Bharadwaj : వెండితెరపై నటిగా అనసూయ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టినా ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక తాజాగా ఆమె నటించిన సినిమా ‘ రజాకార్ ‘. తెలంగాణలో రజాకార్ల దాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ పై గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. బాబీ సింహ, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా మార్చి 15న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం భాషలతో పాటు మరాఠీ, హిందీ భాషలోనూ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషించారు. రంగస్థలంలో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ పుష్ప, విమానం, ప్రేమ విమానం, రంగమార్తాండ లాంటి సినిమాలో అద్భుతంగా నటించి అలరించరు. తాజాగా రజాకార్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న అనసూయ రజాకార్ సినిమా గురించి కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో నటించి ఉండకపోతే తన చరిత్రను తెలుసుకునే అవకాశం కలిగేది కాదన్నారు. రజాకార్ సినిమా తెలంగాణ చరిత్ర గురించి మన మూలాల గురించి చెబుతుంది. మన అస్తిత్వాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఇలాంటి సినిమాల ద్వారా మన గతం ఏంటి అనేది తెలుస్తుంది. నేను చెప్పే విషయాలు కొన్ని సార్లు వివాదం అవుతుంటాయి కానీ ఈ సినిమా విషయంలో ఎలాంటి వివాదం అయినా పర్వాలేదు. ఈ సినిమా వివాదం నాకు ఇష్టమైన వివాదం అంటూ అనసూయ వివరించారు. ఇక రజాకార్ సినిమాలో తన పాత్ర గురించి అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా గురించి దర్శకుడు చెప్పినప్పుడు ఇంత చిన్న పాత్ర ఎందుకు ఇస్తున్నారని అడిగాను. కానీ సినిమాలో చేశాక ఆ పాత్ర ప్రాధాన్యత ఏంటో అర్థమైంది. ఈ సినిమాలో నా పాత్ర చూశాక సినిమాలో అనసూయ కాసేపు కనిపిస్తే బాగుంటుంది అని ప్రేక్షకులు భావిస్తారు. నేను అనుకున్నట్లు జరిగితే గట్టిగా సక్సెస్ అయినట్లేనని భావిస్తాను అని అనసూయ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే సినిమాలోని బతుకమ్మ పాటను విడుదల చేశారు మేకర్స్. తెలంగాణ పల్లెల్లో రజాకార్లు సృష్టించిన మారణ హోమాన్ని గుర్తుచేస్తూ భారతి భారతి ఉయ్యాలో అంటూ పాట కొనసాగుతుంది. ఇందులో అనసూయ బతుకమ్మ ఆడుతూ కనిపించారు. నిజాం పాలకుల మీద ఉన్న కోపాన్ని వెళ్లగక్కుతూ ఈ పాట ఉంటుంది. భారతి భారతి ఉయ్యాల అనే పాట భీమ్స్ సంగీతం అందించారు. అయితే ఈ పాట చూస్తుంటే అనసూయ మరోసారి పవర్ ఫుల్ పాత్రలో నటించినట్లుగా తెలుస్తుంది. ఈ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది