Anasuya Bharadwaj : సైబర్ పోలీసుల చెంతకు అనసూయ.. కేసులు పెట్టేసిన యాంకరమ్మ
Anasuya Bharadwaj : అనసూయ గత నాలుగైదు రోజులుగా నెట్టింట్లో ఎంతగా ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే. లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడం, దాని మీద అనసూయ పరోక్షంగా సెటైర్లు వేయడం, దాంతో విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం అందరికీ తెలిసిందే. ఆ తరువాత నెటిజన్లంతా కూడా అనసూయ దారుణంగా ట్రోల్స్ చేసి పడేశారు. ఆంటీ అంటూ ఆమెను నానా రకాలుగా తిట్టేశారు. ఆంటీ అంటూ అవమానిస్తారా? జాగ్రత్త.. కేసులు పెడతాను అంటూ అనసూయ అందరికీ వార్నింగ్ ఇచ్చింది. దీంతో వివాదం మరింతగా రాజుకున్నట్టు అయింది. ఆంటీ అంటూ అనసూయ విపరీతంగా ట్రోల్స్ చేశారు.
ఆంటీ అనే పదాన్ని నేషనల్ వైడ్‌గా రెండ్రోజులు ట్రెండ్ చేశారు నెటిజన్లు. జాతీయ స్థాయిలో ఆంటీ అనే పదం ట్రోలింగ్ జరిగింది. తనను ఆంటీ అని పిలవొద్దని అనసూయ అనడంతో ఇంకా చాలా మంది అలానే పిలవడం ప్రారంభించారు. ఆంటీ మీద రకరకాల మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఆంటీ అంటే తప్పేంటని నెటిజన్లు నిలదీశారు. ఆంటీ అంటూ తనను ఏజ్ షేమింగ్, బాడీ షేమింగ్ చేస్తున్నారని, తనను ఎలా పిలవాలో చెప్పే హక్కు తనకు ఉందని అనసూయ వాదనకు దిగింది.
అనసూయ గారు, శ్రీమతి అనసూయ, అనసూయ ఇలా ఏదైనా పిలవొచ్చు.. అది మీ సంస్కారానికి నిదర్శనం అన్నట్టుగా అనసూయ తెగ రెచ్చిపోయింది. అయితే జనాలు మాత్రం అనసూయను ఆంటీ అంటూ ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అనసూయ సైబర్ పోలీసుల చెంతకు చేరినట్టుంది. ఆమె మీద దుర్భాషలు ఆడటం, బూతు పదాలతో ట్వీట్లు చేయడంపై అనసూయ ఇలా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కనిపిస్తోంది. పని మొదలుపెట్టాను.. సహకరించిన పోలీసులకు థాంక్స్ అంటూ అనసూయ ట్వీట్ వేసింది.