Anasuya : “జబర్దస్త్” షో రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్..!!

Advertisement

Anasuya : తెలుగు టెలివిజన్ రంగంలో టిఆర్పి రేటింగ్ లలో కామెడీ షో జబర్దస్త్ ఒకప్పుడు టాప్ లో ఉండేది. కానీ కొద్ది నెలల నుండి… జబర్దస్త్ టిఆర్పి రేటింగ్ లు పడిపోయాయి. ఈ షోలో చాలామంది స్టార్ కమెడియన్లు పక్కకెళ్ళిపోవడంతో.. ఈ పరిస్థితి నెలకొంది. ఇక ఇదే షోలో యాంకర్ గా అనసూయ మంచి పాపులారిటీ సంపాదించడం తెలిసిందే. కానీ అనూహ్యంగా ఆమె కూడా షోలో నుండి బయటకు వచ్చేసింది. అయితే అనసూయ ఎందుకు షో నుండి బయటకు వచ్చింది అన్నది కారణం తెలియలేదు.

Anasuya Bharadwaj Gives Clarity About Her Re Entry In Jabardasth Show
Anasuya Bharadwaj Gives Clarity About Her Re Entry In Jabardasth Show

ఇదిలా ఉంటే ఇటీవల అనసూయ పలాసలో ఓ బట్టల షోరూం ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడింది. పలాస ఫస్ట్ టైం తను రావటం జరిగిందని చాలా బాగా నచ్చిందని పేర్కొంది. పలాసలో జీడిపప్పు ఫేమస్ అని విన్నాను. ఇంటికి వెళ్లేటప్పుడు పట్టికెళతాను. ఇక ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు జబర్దస్త్ రేటింగులు పడిపోయాయి.

Advertisement

Anasuya Bharadwaj Reveals About Her Re Entry In Jabardasth Show | Anasuya  Bharadwaj CRAZE In Palasa - YouTube

మీరు మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సంచలన జవాబు ఇచ్చింది. జబర్దస్త్ షోలో తాను యాంకర్ గా చేస్తున్న సమయంలో అసలు రేటింగ్ గురించి పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. ఇంకా తన పరిధిలో అన్ని అనుకూలంగా ఉంటే… మళ్లీ జబర్దస్త్ లోకి వెళ్లే అవకాశాలు ఉండొచ్చని అనసూయ చెప్పుకొచ్చింది. దీంతో అనసూయ కి ఇష్టం లేకుండానే అప్పట్లో స్కిట్ లలో పంచ్ డైలాగులు పడేవి అన్నా కారణంగానే.. ఆమె షో నుండి బయటకు వచ్చిందన్న వార్తలు నిజమవుతున్నాయి.

Advertisement
Advertisement