Anasuya Bharadwaj : అంతా నా ఇష్టం!.. అనసూయ యాటిట్యూడ్ మామూలుగా లేదు
Anasuya Bharadwaj అనసూయ తన హెయిర్ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో అందరికీ తెలిసిందే. వారానికి ఒకసారి హెయిర్ కేర్‌కు వెళ్తానని అనసూయ ఆ మధ్య ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. తన జుట్టును తన కంటే బాగా చూసుకుంటాడు.. ప్రేమిస్తాడు తన రెగ్యులర్ స్టైలిష్ట్ గురించి అనసూయ చెప్పుకొచ్చింది. గత ఎనిమిది పదేళ్ల నుంచి అతని వద్దకే వెళ్తోన్నట్టు చెప్పుకొచ్చింది. అతను ఒకప్పుడు వేరే దగ్గర పని చేసేవాడని, కానీ ఇప్పుడు సొంతంగా హెయిర్ కేర్ పెట్టుకున్నాడని తెలిపింది.

Anasuya Bharadwaj New hair style
అయితే అనసూయ ఇప్పుడు కొత్త లుక్కులోకి మారింది. ఆ మధ్య బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వెరైటీ హెయిర్ స్టైల్‌ను చేయించుకుంది. అయితే అందులో నైజిరియన్‌లా ఉందంటూ రకరకాల కామెంట్లు వచ్చేశాయి. తాజాగా అనసూయ ఈ వీకెండ్‌ను తన హెయిర్ కేర్‌కు కేటాయించినట్టు కనిపిస్తోంది. సండే రోజు అనసూయ తన జుట్టు కోసం సమయం కేటాయించినట్టు అనిపిస్తోంది. తాజాగా తన కొత్త హెయిర్ స్టైల్ గురించి చెబుతూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Anasuya Bharadwaj : అనసూయ కొత్త హెయిర్ స్టైల్

Anasuya Bharadwaj New hair style
తన జుట్టు తన ఇష్టమంటూ అనసూయ చెప్పుకొచ్చింది. నా స్టేట్ ఆఫ్ మైండ్‌కు తగ్గట్టుగా నా కొత్త హెయిర్ స్టైల్‌ను డిజైన్ చేసుకున్నానుఅని తెలిపింది. సెల్ఫ్ కేర్ సండే అంటూ ఈ ఆదివారాన్ని తన శిరోజాల సంరక్షణ కోసం కేటాయించినట్టు తెలిపింది. సెల్ఫ్ కేర్ అంటే సెల్ఫీష్ కాదని చెప్పింది. నా జుట్టు నా రూల్స్ అంతా నా ఇష్టమంటూ అనసూయ తెగ హడావిడి చేసేసింది. ప్రస్తుతం ఆమెకొత్త లుక్కు వైరల్ అవుతోంది. ఇది స్పెషల్‌గా ఏదైనా ప్రాజెక్ట్ కోసమా? లేదా? రెగ్యులర్ లుక్ కోసమా? అన్నది తెలియాలి.