Anasuya : గ్యాప్ లేకుండా అదే పని.. యాంకర్ అనసూయ రచ్చ
Anasuya : యాంకర్ అనసూయ ఇప్పుడు ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై రచ్చ రచ్చ చేస్తోంది. క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. అయితే అనసూయ ఏది చేసినా కూడా జనాలను అట్రాక్ట్ చేసేలానే ఉంటుంది. అవి కచ్చితంగానెట్టింట్లో కాంట్రవర్సీకి దారి తీస్తూనే ఉంటాయి.

Anasuya Comments On Her Busy Schedule And Shootings
అనసూయ మీద ట్రోలింగ్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఎంత ట్రోలింగ్ జరిగినా కూడా అనసూయ వెనక్కి తగ్గదు.ఆ మధ్య కోట శ్రీనివాస రావుచేసిన కామెంట్లు, వాటికి కౌంటర్లుగా అనసూయ వేసిన కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అనసూయ వస్త్రాధారణ మీద కోట చేసిన కామెంట్లకు ధీటుగా సమాధానం ఇచ్చింది.
Anasuya : మరిచిపోయానన్న అనసూయ

Anasuya Comments On Her Busy Schedule And Shootings
మీలాంటి వాళ్లు కూడా అంటున్నారు.. మీ కాలంలో మీరు వేసుకున్న బట్టలు, చేసిన పాత్రల సమయంలో అలాంటి మాటలు ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించింది.అలా అనసూయ తీవ్ర స్థాయిలో మండిపడింది. అనసూయ పుష్ప, ఫ్లాష్ బ్యాక్ వంటి సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉంది. నిన్ననే దాక్షాయని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఆ లుక్కుతో అనసూయ అందరినీ కట్టిపడేసింది. అయితే తాజాగా అనసూయ ఫోటో షూట్‌ను షేర్ చేసింది. అందులో ఓ కామెంట్ చేసింది. ఇది గురువారం అని నేను మరిచిపోయాను.. నన్ను క్షమించండి.. టైం అన్నది చూసుకోకుండా షూటింగ్‌తో బిజీగా ఉన్నాను.. ఇలా ఎప్పుడూ పని దొరకడం ఎంతో ఆనందంగా ఉందని అనసూయ చెప్పుకొచ్చింది.