Anasuya : వాళ్లతో కలిసి ఆ పనులు మొదలెట్టేసిన యాంకర్ అనసూయ..!
Anasuya యాంకర్ అనసూయ బుల్లితెర, వెండితెర మీద ఎంతటి క్రేజ్‌ను సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అనసూయ వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా మారింది. ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ఫ్లాష్ బ్యాక్’. ”గుర్తుకొస్తున్నాయి” అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సినిమాను అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై P. రమేష్ పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. డాన్ శ్యాండీ దర్శకత్వం వహిస్తున్నారు.

Anasuya Bharadwaj Dubbing Starts For Parbhus Deva Flash back
తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథను తెరపై ఆవిష్కరించబోతున్నారు. చిత్రంలో యంగ్ హీరోయిన్ రెజీనా ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్‌గా విలక్షణ పాత్ర పోషిస్తుండగా.. అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ ఇద్దరి రోల్స్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానున్నాయి. అనసూయ రోల్ హైలైట్ కానుందని, ప్రభుదేవా క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్పారు.
Anasuya : డబ్బింగ్‌లో అనసూయ బిజీ..

Anasuya Bharadwaj Dubbing Starts For Parbhus Deva Flash back
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ వేగంగా ఫినిష్ చేస్తోంది. ఇందులో భాగంగా మొదట అనసూయ డబ్బింగ్ స్టార్ట్ చేయగా, ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పేలా డబ్బింగ్ థియేటర్‌లో జబర్దస్త్ పోజిచ్చి ఆకట్టుకుంది అనసూయ. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ ‘ఫ్లాష్ బ్యాక్’ మూవీకి నందు దుర్లపాటి మాటలు రాశారు. మొత్తానికి అనసూయ డబ్బింగ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ చెబుతోన్నట్టు కనిపిస్తోంది. ఈ చిత్రంతో అనసూయ కోలీవుడ్‌లోనూ పాగా వేస్తుందేమో చూడాలి.