Anasuya : నిండుగా చీర కట్టినా కూడా అనసూయలో గ్లామర్ షో తగ్గలేదుగా..!
Anasuya : అందాల చందమామ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. టీవీల్లో వివిధ షోలకు యాంకరింగ్‌గా చేస్తూనే సినిమాల్లోను నటిస్తూ అదరగొడుతున్నారు అనసూయ. ఈ భామకు ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో ద్వారా సూపర్ పాపులారిటీ వచ్చింది. తన మాటలతోనే కాకుండా అందచందాలతో అదరగొడుతూ కనుల విందు చేస్తోంది ఈ అందాల యాంకర్. అనసూయ పొట్టి బట్టలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం చెలరేగుతూ ఉంటుంది. లేటెస్ట్ గా ఓ నెటిజన్ ఇద్దరు పిల్లల తల్లై ఉండి అలాంటి బట్టలు ఎలా వేసుకుంటున్నారంటూ.. ప్రశ్నించాడు. దానికి సమాధానంగా అనసూయ… నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా.
ఇలా బట్టలపై కామెంట్ చేసి మగజాతి పరువు తీయకు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ విసిరింది.
తగ్గట్లేదుగా..!ఎవరెన్ని కామెంట్స్ చేసిన కూడా అనసూయ తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. ఈ అమ్మడు చేసే రచ్చకి సోషల్ మీడియా షేక్ అవుతుంటుంది. తాజాగా అనసూయ భరద్వాజ్ మరోసారి చక్కని చీరకట్టుతో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. సిగ్గులొలికిస్తూ..హొయలు ప్రదర్శిస్తూ..వయ్యారాలు పోతూ నీలిరంగు చీరలోనా..మెరిసిపోతూ అనసూయా.. అని ఊరిస్తుంది. అనసూయని చూసిన ప్రతి ఒక్కరు ఆమెపై ప్రశంసల జల్లు కరిపించకుండా ఉండలేకపోతున్నారు. జబర్దస్త్ షో పిచ్చ పాపులర్ కాగా… యాంకర్ అనసూయ కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

anasuya glamorous looks viral
ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె నటిగా ఫుల్ బిజీ అయ్యారు. స్టార్ హీరోల చిత్రాలలో కీలక రోల్స్ చేస్తున్న ఆమె, మరోవైపు హీరోయిన్ గా ఆఫర్స్ పెట్టేస్తున్నారు. అనసూయ ప్రధాన పాత్రలో దర్జా టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. ఇటీవల దర్జా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జా మూవీలో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది. దర్జా మూవీలో ఆమె లుక్ లేడీ డాన్ ని పోలి ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసింది అనసూయ. ఆమె చలాకీతనం, మెస్మరైజ్ చేసే అందంతో సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. వెండితెరపై ఓ తరహా పాత్రలకు అనసూయ బెస్ట్ ఛాయిస్ అయ్యారు. రంగస్థలం మూవీలో అనసూయ రోల్ ఆమెకు బ్రేక్ ఇవ్వగా వెండితెరపై బిజీ అయ్యారు.