Anasuya : కైపెక్కించే కళ్లతో నిషా ఎక్కిస్తున్న అనసూయ.. మతులు పోతున్నాయంటున్న ఫ్యాన్స్
Anasuya : నటిగా, యాంకర్‌గా అదరగొడుతున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. ఈ అమ్మడు ఇద్దరు పిల్లల తల్లి అయిన కూడా తన అందచందాలతో ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది. బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్‌గా అలరిస్తూనే వెండితెరపై రంగమ్మత్త, దాక్షాయణి వంటి అద్భుతమైన పాత్రలతో అనసూయ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. మొత్తానికి అనసూయ అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్నిచోట్ల దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఆ భాష ఈ భాష అని తేడా లేకుండా సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళ ద్వి భాష చిత్రాలు చేస్తోంది. కేరళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాతో మళయాలంలోకి అనసూయ ఎంట్రీ ఇస్తోంది.
బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వెబ్ సిరీస్‌లకు కూడా అనసూయ ఓకే చెప్పినట్టు సమాచారం.జబర్ధస్త్ షోకి డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో పలకరించే అనసూయ వెరైటీ దుస్తులలో ఫొటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. గురువారం (ఫిబ్రవరి 3) ప్రసారంకానున్న జబర్దస్త్ కార్యక్రమం సందర్భంగా యాంకర్ అనసూయ చేసిన ఫొటోషూట్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మోడ్రన్ డ్రస్సులో ఆకట్టుకునే హావభావాలతో అలరించింది. ప్రతివారం ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో వెరైటీ డ్రస్సులలో అలరిస్తోంది అనసూయ. తాజాగా అనసూయ షేర్ చేసిన క్యూట్ పిక్స్ అందరి మతులని దోచేస్తున్నాయి.

anasuya glamorous pics shakes the internet
Anasuya : తగ్గేదే లే అంటున్న అనసూయ..
అనసూయ.. ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అనసూయ ఇప్పటికే పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించింది. ‘క్షణం’, ‘రంగస్థలం’ చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఖిలాడీ సినిమాలో అయితే అనసూయది ఫుల్ లెంగ్త్ రోల్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకరికి అనసూయ తల్లిగా నటిస్తుందట. ఇందులో ఆమె పాత్ర పేరు చంద్రకళ అట. హీరోయిన్‌కు తల్లిగా మాత్రమే కాకుండా గ్లామర్‌గాను అనసూయ ‘చంద్రకళ’గా కనువిందు చేయనుందట.