Anasuya : అమ్మ‌ని అన్న ఉసురు ఊరికే పోదు అంటూ అన‌సూయ అంత‌లా అనేసింది ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : అమ్మ‌ని అన్న ఉసురు ఊరికే పోదు అంటూ అన‌సూయ అంత‌లా అనేసింది ఏంటి?

 Authored By sandeep | The Telugu News | Updated on :25 August 2022,8:40 pm

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాలు, సోష‌ల్ మీడియా,బుల్లితెరపై మంచి వినోదం పంచుతూ ప్రేక్షకుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి సోష‌ల్ మీడియాలో అన‌సూయ చేసే కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారుతూ ఉంటాయి. తాజాగా అన‌సూయ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేయ‌గా, ప్ర‌స్తుతం దీనిపై అంద‌రు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుపుతున్నారు. వివ‌రాల‌లోకి వెళితే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ క్రేజీ కాంబినేషన్ లో భారీ అంచనాలతో లైగర్ చిత్రం నేడు విడుదలయింది. ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Anasuya : అన‌సూయ షాకింగ్ కామెంట్స్..

పూరి జగన్నాధ్ మరోసారి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు. హిందీలో కూడా ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అంటూ ఒక రేంజ్ లో హైప్ నెలకొంది. మసిపూసి మారేడు చేసినట్లు ప్రమోషన్స్ తో హైప్ తెచ్చుకున్నారు. కానీ సినిమాలు ఏమీ లేదంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. పూరి జగన్నాధ్ తో పాటు విజయ్ దేవరకొండ పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. బోల్డ్ యాటిట్యూడ్ అన్ని సమయాల్లో వర్కౌట్ కాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అన‌సూయ చేసిన కామెంట్స్ కూడా చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. తాజాగా స్టార్ యాంకర్, నటి అనసూయ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. అనసూయ ట్విట్టర్ వేదికగా చేసిన ఈ కామెంట్స్ విజయ్ దేవరకొండని ఉద్దేశించే అంటూ నెటిజన్లు డిసైడ్ అవుతున్నారు.

anasuya indirect comments viral

anasuya indirect comments viral

ఇంతకీ అనసూయ ఏమందంటే.. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా ..ఎదుటివారి బాధని చూసి సంతోష పడడం లేదు కానీ ధర్మమే గెలిచింది’ అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అర్జున్ రెడ్డి చిత్రంలో అమ్మని తిట్టినట్లుగా ఉండే ఒక బూతు డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అర్జున్ రెడ్డి మూవీ సమయంలో ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో అందరికి తెలిసిందే. ఆ డైలాగ్ ని అనసూయ కూడా వ్యతిరేకిస్తూ మీడియాకి ఎక్కింది ఇలాంటి వాటికి తానూ వ్యతిరేకం అంటూ అనసూయ అప్పట్లో మీడియా డిబేట్స్ లో తెలిపింది. అప్పుడు అమ్మని ఉద్దేశించి చెడుగా పెట్టిన డైలాగ్.. ఇప్పుడు కర్మ రూపంలో లైగర్ మూవీగా తిరిగి వచ్చింది అని అర్థం వచ్చేలా అనసూయ కామెంట్స్ ఉన్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది