Anasuya : పర్పుల్ కలర్ డ్రెస్‌లో మెలికలు తిరుగుతూ మత్తెక్కిస్తున్న అనసూయ
Anasuya: అందానికి అందం, నటనకు నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా డ్యాన్సులు చేయడంలోనూ అనసూయ తనకు తానే సాటి. అయితే అప్పుడప్పుడు ఆమె పెట్టే పోస్టులు, కామెంట్లపై తెగ ట్రోలింగ్ జరుగుతుంది. ఇటీవల ఆంటీ అంటూ అనసూయని తెగ ట్రోల్ చేశారు.దానికి అనసూయ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది.
ఎప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలతో రచ్చ్ చేసే అనసూయ ఇటీవల వీడియోలతో హంగామా చేస్తుంది. కేక పెట్టించే అందాలతో కుర్రాళ్లు థ్రిల్ అయ్యేలా వయ్యారాలు పోతుంది. అనసూయని ఇలా చూసి కుర్రాల్లు థ్రిల్ అవుతున్నారు. తాజాగా అనసూయ పర్పుల్ కలర్ డ్రెస్ లో బాలీవుడ్ సాంగ్ కి చిందులేస్తూ హంగమా సృష్టించింది. ఈ అమ్మడి బ్యూటీ ఫుల్ లుక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంటాయి. అంతేకాదు అనసూయ అందాలు మతులు పోతున్నాయనే చెప్పాలి.

anasuya mind blowing looks
Anasuya : అదిరే అందం..
ఓ వైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఇటీవలే వాంటెడ్పండుగాడ్మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె ‘రంగమార్తాండ’, ‘వేదాంతం రాఘవయ్య’, ‘గాడ్ ఫాదర్’, ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప 2’, ‘భోళా శంకర్’ వంటి భారీ చిత్రాల్లో భాగమైంది. వెబ్‌సిరీస్‌లకు కూడా ప్రాధాన్యత ఇస్తానంటోంది అనసూయ. ఇందులో భాగంగానే కన్యాశుల్కం అనే వెబ్‌సిరీస్‌లో అనసూయ నటించనుంది. గురజాడ అప్పారావు క్లాసిక్నాటకం ఆధారంగా వస్తున్న ఈ సిరీస్‌లో మధుర వాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం. దీర్ఘ కాలంగా జబర్దస్త్ లో సత్తా చాటిన అనసూయ ఇటీవలే స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి అనసూయ ఓ పిల్లల కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తోంది. ఇక, ఇటీవలే ఆమె జబర్ధస్త్ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే.
View this post on Instagram