Anasuya : అనసూయ కూడా ఎఫ్ పదం వాడిందంటూ వివాదంలోకి పట్టుకొచ్చిన కరాటే కళ్యాణి
Anasuya : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు అనసూయ. తనదైన అందచందాలతో అలరిస్తూ కుర్రకారు మనసులు కొల్లగొడుతుంది. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. అనసూయ ..వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.
అయితే తన పాటికి తాను సినిమాలు, సీరియల్స్ చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో అనసూయని వివాదంలోకి తీసుకొచ్చింది కరాటే కళ్యాణి.తన సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ చేసిన ఫ్రాంక్ వీడియోపై దుమారం రేగింది. పబ్లిక్ న్యూస్ చేస్తున్న పాగల్ సేన్ అంటూ టీవీ 9 ఛానల్ డిబేట్‌లు పెట్టడంతో వివాదం ముదిరింది. తనని వ్యక్తిగతంగా ఎటాక్ చేస్తున్న ఛానల్‌కి డైరెక్ట్‌గా వెళ్లి లైవ్ డిబేట్‌లో కూర్చున్నాడు విశ్వక్ సేన్. ఆ డిబేట్ నిర్వహిస్తున్న దేవితో మాట మాటా పెగిగి బూతులు వరకూ వెళ్లింది. యాంకర్ దేవి గెటౌట్ అంటూ ఆగ్రహించడంతో విశ్వక్ సేన్ నోటికి పనిచెప్పాడు.

anasuya name in controversy
Anasuya : అనసూయ అన్యాయంగా..
F*** అనే బూతుని వాడటంతో ఈ వివాదం మరింత ముదిరింది.తాజాగా ఈ వివాదంపై కరాటే కళ్యణి స్పందించింది. ‘3*3 టీవీ వర్సెస్ సేన్‌లో పూర్తిగా టీవీ వాళ్లదే తప్పు. నేను ఆ హీరోకే సపోర్ట్ చేస్తా. అనసూయ ఎన్నిసార్లు F** పదం వాడినప్పుడు నువ్వు రోడ్డు మీద డాన్స్ చేసినప్పుడు ఏమైంది అమ్మ?’’ అంటూ చురకలు అంటించింది కరాటే కళ్యాణి. నువ్వే కాదు మేం కూడా విశ్వక్ సేన్‌కే మద్దతు ప్రకటిస్తున్నాం అంటూ నెటిజన్లు కళ్యాణి పోస్ట్‌పై స్పందిస్తున్నారు. అయితే ఈ వివాదంలోకి అర్జెంట్‌గా అనసూయని ఎందుకు లాగిందో అస్సలు అర్ధం కావడం లేదంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.