Anasuya : అనసూయ నిజంగానే ‘ఖిలాడీ’.. అక్కడికి చెక్కేస్తోందిగా!
Anasuya అనసూయ చేతిలో ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్‌లున్నాయో కూడా సరిగ్గా లెక్కపెట్టలేం. సెట్స్ మీద ఐదారు ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నాయి. చర్చల దశల్లో ఇంకా చాలానే ఉన్నట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా అనసూయ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. మాలీవుడ్ మెగాస్టార్ మమ్మట్టితో కేరళలో సినిమా చేస్తోంది. తమిళంలోనూ సినిమాలను చేస్తోన్నట్టు తెలుస్తోంది.

Anasuya Off To Dubai For Raviteja Khiladi Shoot
ఇక తెలుగులో అయితే క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో భాగస్వామి అయింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రాబోతోన్న పుష్పలో అనసూయకు అదిరిపోయే పాత్రను ఇచ్చారు. ముందుగా ఆమెకు రోల్ లేకపోయినా తరువాత క్రియేట్ చేశారు. అనసూయ అడగడంతో అలా చేసినట్టు తెలుస్తోంది. ఇక మాస్ మహరాజా రవితేజ హీరోగా వస్తోన్న ఖిలాడీ సినిమాలోనూ అనసూయ నటిస్తోంది.
Anasuya ఖిలాడీ సెట్‌లో అనసూయ

Anasuya Off To Dubai For Raviteja Khiladi Shoot
తాజాగా ఖిలాడీ యూనిట్ దుబాయ్‌కు చెక్కేసింది. రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతీల మీద పాటను షూట్ చేసేందుకు అక్కడికి వెళ్లారు. దుబాయ్, మస్కట్ ప్రాంతాల్లో పాటను చిత్రీకరించబోతోన్నారు. అయితే అనసూయ కూడా అక్కడికే చెక్కేసినట్టు తెలుస్తోంది. ఖిలాడి అంటూ ఫ్లైట్ సింబల్ వేసి.. జంప్ అవుతున్నాను అన్నట్టుగా అనసూయ తెలిపింది.