Anasuya : అలాంటివన్నీ ఆయనే చేస్తాడు.. భర్త గుట్టు విప్పిన అనసూయ
Anasuya : అనసూయ భరద్వాజ్ బుల్లితెర మీద ఎంత చలాకిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా అనసూయ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన భర్తకు సంబంధించిన ఎన్నో రహస్యాలను బయటపెట్టేసింది. మామూలుగా ఈ ఇద్దరూ జోడి ప్రేమ కథ అందరికీ తెలిసిందే. కాలేజ్ వయసులోనే ప్రేమించుకోవడం, ఇంట్లో పెళ్లి చేసుకున్నా కూడా బయటకు చెప్పకపోవడం, లేచిపోయి పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే.

Anasuya Bharadwaj On Susank Bharadwaj
ఇప్పటికీ ఈ జోడి ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. ఎవరి వృత్తి వారిదే అన్నట్టుగా ఉంటారు. అనసూయ భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇక అనసూయ ఏమో ఇలా గ్లామర్ ఫీల్డ్‌లో దుమ్ములేపుతుంది. అనసూయ భర్త సుశాంక్ కూడా నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. అనసూయ షేర్ చేసే వీడియోల్లో సుశాంక్ ఎక్కువగా కనిపిస్తాడు. ఈ ఇద్దరూ కలిసి వర్కవుట్లు కూడా చేస్తుంటారు
Anasuya : భర్తపై అనసూయ కామెంట్స్..

anasuya photos viral in social media
అయితే తాజాగా అనసూయ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో కొన్ని ప్రశ్నలు ఆటోమెటిక్‌గా అడిగేస్తున్నారు. మీలో ఎవరు ఎక్కువగా తింటారు అనే ప్రశ్నకు తానే అని అనసూయ చెప్పుకుంది. భరద్వాజ్ కూడా అనసూయ వైపే వేలు చూయించాడు.ఎవరు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారంటే తానే అని అనసూయ చెప్పేపింది. ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారంటే.. తన మొగుడే అని అనసూయ చెప్పేసింది. ఎవరు ఎక్కువగా విసిగిస్తారంటే.. ఆయనే అని అనసూయ చెప్పింది.
View this post on Instagram