Anasuya : సాయంకాలం సయ్యాటలు.. భర్తతో అనసూయ అలా..!
Anasuya : అనసూయ షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి మాత్రం చాలా ప్రాముఖ్యతను ఇస్తుంటుంది. ఫ్యామిలీ కోసం స్పెషల్‌గా టైం కేటాయిస్తుంది. భర్త, పిల్లలతో కలిసి అనసూయ ఎంజాయ్ చేస్తుంటుంది. వీకెండ్లో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్లకు వెళ్లదు. ఇంటి పట్టునే ఉంటూ పిల్లలతో సమయాన్ని వెచ్చిస్తుంటుంది. వెకేషన్లకు వెళ్తుంటారు. రెస్టారెంట్లకు తిరుగుతుంటారు. అలా అనసూయ ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది.
ఇక పండుగలు వచ్చిందంటే ఇంట్లోనే ఉంటుంది. తాజాగా అనసూయ తన భర్తతో కలిసి అలా సాయంకాలన ఆటలు ఆడినట్టు కనిపిస్తోంది. అలా సాయంత్రం డాబా మీద షటిలో ఆడుతూ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు అనసూయ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో అనసూయను గమనిస్తే ఆడి ఆడి తెగ అలిసిపోయినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ఓ కామెంట్ కూడా చేసింది. భర్త పొగిడాడంటూ తెగ మురిసిపోయింది.

anasuya plays with susank bharadwaj
Anasuya : భర్తతో అనసూయ ఆటలు..
అలా సాయంత్రం ఆడి ఆడి కాస్త చీకటి అయినట్టుంది. ఆకాశంలో చందమామ కూడా వచ్చేశాడు. అలా తన భర్తతో కలిసి సెల్ఫీలు దిగిన అనసూయ ఆ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో చందమామ ఎవరో తెలియడం లేదంటూ అనసూయ అందం గురించి చెప్పుకొచ్చింది. తన భర్త కన్ఫ్యూజన్‌లో ఉన్నాడట. చందమామ ఎవరో గుర్తు పట్టడం లేదట. మొత్తానికి అలా ఆడుకుంటూ సాయంత్రం పూట గడిపేశామని చెప్పకనే చెప్పేశారు. అనసూయ పుష్ప సినిమాలోని దాక్షాయణి లుక్కుకు అందరూ ఫిదా అయ్యారు.