Anasuya : అన‌సూయ అదిరిపోయే లుక్స్.. క‌ష్టాలు మాములుగా లేవుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : అన‌సూయ అదిరిపోయే లుక్స్.. క‌ష్టాలు మాములుగా లేవుగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :5 April 2022,6:00 pm

Anasuya : యాంక‌ర్ అన‌సూయ అంద‌చందాలు వాక్‌చౌతుర్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బుల్లితెరపై.. వెండితెరపై తనదైన టాలెంట్‌తో దూసుకుపోతున్న ఈ అందాల ముద్దుగుమ్మ వరుస ఆఫర్లతో ఫుల్ జోష్ మీద ఉంది. అనసూయకు ట్రోలింగ్ కొత్తేమి కాదు. తాను షేర్ చేసే ప్రతి చిన్న ఫోటోపై.. పోస్ట్‏లపై ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తుంటారు నెటిజన్స్. ముఖ్యంగా అనసూయ డ్రెస్సింగ్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. రీసెంట్‌గా ఓ నెటిజ‌న్ … అనసూయ గారు.. మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా.. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు ” అంటూ కామెంట్ చేశాడు.

నెటిజ‌న్ కామెంట్‌కి అన‌సూయ ఘాటుగా స్పందించింది. ” దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు. ” అంటూ తన స్టైల్లో సమాధానమిచ్చింది. అయితే ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసిన కూడా అన‌సూయ త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతుంది. ఈ అమ్మ‌డు తాజాగా పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఫొటో షూట్ చేసింది. ఇందులో అన‌సూయ ప‌లు యాంగిల్స్ పెడుతూ వెరైటీ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తుంది. అన‌సూయ ప‌డుతున్న క‌ష్టాలు చూసి నెటిజన్స్ అవాక్క‌వుతున్నారు. ఇంత క‌ష్ట‌ప‌డాలా అంటూ ఓదార్పు యాత్ర చేస్తున్నారు.అనసూయ .

anasuya stunning photo shoot Video

anasuya stunning photo shoot Video

Anasuya : అన‌సూయ త‌గ్గ‌ట్లేదుగా..

ఇటీవల అల్లు అర్జున్ , డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో నటించి మెప్పించింది . అలాగే.. ఆచార్య, రంగమార్తాండ, దర్జా సినిమాల్లో కీలకపాత్రలలో నటిస్తోంది.భీష్మ ప‌ర్వంలో కూడా న‌టించింది. చిరంజీవి తో క‌లిసి యాడ్ చేసింది. ఆయ‌న సినిమాల‌లో కూడా న‌టించిన‌ట్టు స‌మాచారం. శుభ‌గృహ యాడ్‌లో న‌టించిన అన‌సూయ దాదాపు రూ. 20 లక్షల వరకు పారితోషకం తీసుకున్న‌ట్టు సమాచారం. ఆమె పాత్రకున్న పరిధి మేరకు ఇంత ముట్టజెప్పినట్టు సమాచారం. ఇక అనసూయ విషయానికొస్తే.. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కేవలం గ్లామర్ షోకే పరిమితమైన అనసూయ.. ఆ తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’ తో పాటు రామ్ చరణ్,సుకుమార్‌ల ‘రంగస్థలం’ మూవీలతో నటిగా అనసూయ స్టామినా ఏంటో ప్రేక్షకులకు తెలిసొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది