Anasuya : చెప్పు తెగుద్ది అంటూ అనసూయ వార్నింగ్.. వైరల్ అవుతున్న వీడియో
ప్రధానాంశాలు:
Anasuya : చెప్పు తెగుద్ది అంటూ అనసూయ వార్నింగ్.. వైరల్ అవుతున్న వీడియో
Anasuya : తెలుగు ప్రేక్షకుల్లో అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్‌గా, నటిగా రెండు విభిన్న రంగాల్లో విజయవంతంగా కొనసాగుతూ విశేష గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది.తన వ్యక్తిగత విషయాలు, సినిమాలతో పాటు ముఖ్యమైన సందర్భాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా అనసూయ ఓ ఘటనతో వార్తల్లోకి వచ్చింది.

Anasuya : చెప్పు తెగుద్ది అంటూ అనసూయ వార్నింగ్.. వైరల్ అవుతున్న వీడియో
Anasuya : అనసూయ ఫైర్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అనసూయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతుండగా, కొంతమంది యువకులు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె వారిపై తీవ్రంగా మండిపడింది. అనసూయ సదరు యువకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, “ఇలాంటి మాటలు మీ ఇంట్లో మీ అమ్మ, చెల్లెలు, ప్రేయసి లేదా భవిష్యత్తులో మీ భార్యపై ఎవరైనా చెబితే ఊరుకుంటారా?” అంటూ ఎదురు ప్రశ్నలు చేసింది. “పెద్దవారిని గౌరవించడం మీ ఇంట్లో నేర్పించలేదా?” అంటూ ఆగ్రహంతో స్పందించింది. “చెప్పు తెగుద్ది” అంటూ వార్నింగ్ ఇచ్చింది.
ప్రస్తుతం అనసూయ స్పందనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యంగా వ్యవహరించిన తీరు నెటిజన్ల నుంచి ప్రశంసలు పొందుతోంది. అనసూయ ప్రస్తుతం నటిగానే కాకుండా హోస్ట్‌గా కూడా అదరగొడుతుంది. అనసూయ పలు వివాదాలతో కూడా హాట్ టాపిక్‌గా కూడా మారుతుంటుంది.
Anasuya Garu @anusuyakhasba on fire in public on BanisaSena Slaves after vulgar comments passed on.🔥🔥🔥
Emi luchha party ra meedi @JSPShatagniTeam pic.twitter.com/pBs2MF7G5q
— parody (@MrX_Alt) August 2, 2025