Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ పెళ్లి అయ్యింది… ఈ వార్తల్లో నిజం ఎంత?

Authored By Himanshi | The Telugu News | Published on: February 20, 2022, 11:00 am

Anchor Pradeep : బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ పేరు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ గత కొన్ని రోజులుగా సందడి తగ్గించాడు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ఏ షోలో చేసినా కూడా ప్రదీప్‌ కనిపించేవాడు. కానీ ఇప్పుడు ప్రదీప్ చాలా తక్కువ షో ల్లో మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు. ప్రదీప్ లేని లోటు తెలుగు బుల్లి తెరపై చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంటూ బుల్లి తెర వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ ప్రదీప్ మళ్లీ బిజీ అవ్వాలంటూ ఆయన వరుసగా షోలు చేయాలంటూ అభిమానులు వేడుకుంటున్నారు. ఈ సమయంలోనే ఆయన పెళ్లి చేసుకోవడం వల్ల షో లు తగ్గించాడు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

హీరోగా బిజీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన షో లకు దూరంగా ఉంటున్నాడనే ప్రచారం కూడా మొదలు అయ్యింది. యాంకర్ ప్రదీప్ పెళ్లి విషయమై గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన పెళ్లి కోసం ఏకంగా ఒక రియాల్టీ షో చేయడం జరిగింది. ఆ రియాల్టీ షో మరీ దారుణంగా ప్లాప్ అవ్వడంతో పాటు ఆయన నిజంగా పెళ్లి చేసుకుంటాడు అంటూ అంతా అనుకుని మోస పోయారు. ఆ షో కు సుమ యాంకర్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. బుల్లి తెర చరిత్రలో అలాంటి షో గతంలో ఎప్పుడు జరగలేదు. యాంకర్ ప్రదీప్ పెళ్లి వివాదాస్పదమైంది ఎన్నో రకాలుగా పుకార్లు షికార్లు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసేసుకున్నాడు అంటూ వార్తలు మొదలు అయ్యాయి. ఆయన పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు.

anchor pradeep marriage news viral

anchor pradeep marriage news viral

పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో అభిమానులు గందరగోళంకు గురి అవుతున్నారు. తాజాగా యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకున్నాడు.. ఆయన పెళ్లి రహస్యంగా జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రదీప్ పెళ్లి చేసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ విషయమై ప్రదీప్ ను బెదిరించారని.. ఆ కారణంగానే పెళ్లి గురించి బయటకు తెలియడం లేదని వార్తలు వస్తున్నాయి. అమ్మాయి ఎవరు అనే విషయం పై కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చర్చించుకుంటున్నారు. అమ్మాయి వైజాగ్ చెందిన వ్యాపారవేత్త అమ్మాయని.. హైదరాబాదులో ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. యాంకర్ ప్రదీప్ పెళ్లి విషయంలో ఎలాంటి నిజం లేదు అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంటే ఇష్టం లేని వారు ఇలాంటి పుకార్లు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. మొత్తానికి యాంకర్ ప్రదీప్ పెళ్లి విషయము సుదీర్ఘంగా చర్చ జరుగుతూనే ఉంది.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp