Rashmi And Sudheer : ఎరుపు చీరలో రష్మీ.. ఎత్తుకుని గిరాగిరా తిప్పుతూ సుధీర్ రొమాన్స్.. వీడియో వైరల్
Rashmi And Sudheer : యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ జంటకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు పదేళ్లు దాటిని కూడా అదే కెమిస్ట్రీని, అదే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగిస్తుంటారు. మధ్యలో రష్మీ, సుధీర్ వేర్వేరు చానెళ్లో ఉండాల్సి వచ్చింది. రష్మీ ఈటీవీలోనే ఉండిపోయింది. సుధీర్ స్టార్ మాలోకి వెళ్లాడు. అటు నుంచి అటు సినిమాల్లో బిజీగా మారిపోయాడు. గాలోడు సినిమా హిట్టవ్వడంతో వరుసగా ప్రాజెక్టులు కమిట్ అవుతూ వచ్చాడు. అందుకే […]
Rashmi And Sudheer : యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ జంటకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు పదేళ్లు దాటిని కూడా అదే కెమిస్ట్రీని, అదే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగిస్తుంటారు. మధ్యలో రష్మీ, సుధీర్ వేర్వేరు చానెళ్లో ఉండాల్సి వచ్చింది. రష్మీ ఈటీవీలోనే ఉండిపోయింది. సుధీర్ స్టార్ మాలోకి వెళ్లాడు. అటు నుంచి అటు సినిమాల్లో బిజీగా మారిపోయాడు. గాలోడు సినిమా హిట్టవ్వడంతో వరుసగా ప్రాజెక్టులు కమిట్ అవుతూ వచ్చాడు.
అందుకే సుధీర్ బుల్లితెరపై కనిపించడం మానేశాడు. షోలు చేయడం లేదు. ఈవెంట్లకు రావడం లేదు. ఇక సుధీర్ రష్మీ బుల్లితెరపై కలిసి కనిపించరని అంతా అనుకున్నారు. ఇక ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తారని కూడా రూమర్లు వస్తూనే ఉన్నాయి. సరైన కథ దొరికితే నటిస్తామని సుధీర్ ఇది వరకే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ తెరపై రొమాన్స్ చేసే కంటే ముందే బుల్లితెరపై మళ్లీ కలిసి కనిపించి రచ్చ చేస్తున్నారు.
ఈటీవీ వార్షికోత్సవం అంటూ బలగం అనే ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. ఇందులో ఈటీవీలో పని చేసిన సీరియల్ ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు, సినిమా సెలెబ్రిటీలందరినీ ఒకే చోటకు తీసుకువచ్చారు. ఈ ఈవెంట్‌ను రష్మీ, సుధీర్ కలిసి హోస్ట్ చేశారు. ఈ సందర్భంగానే మళ్లీ ఇద్దరూ పక్కపక్కనే కనిపించారు. కనిపించడం, మాట్లాడుకోవడమే కాదు.. రొమాంటిక్ పర్ఫామెన్సులతో మంటలు పుట్టించారు. ఎరుపు చీరలో రష్మీ కనిపించింది. ఇక రష్మీని సుధీర్ ఎత్తుకుని గిరాగిరా తిప్పుతూ డ్యాన్సులు చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.