Rashmi Gautam : వాళ్లే నిజమైన హీరోలు.. యాంకర్ రష్మికి జై కొట్టిన నెటిజన్లు!
Rashmi Gautam యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై రష్మి అల్లరి చిల్లరగా కౌంటర్లు, సెటైర్లు వేస్తూ కనిపించినా, పిచ్చిగా గెంతులు వేసినా కూడా అది నటనకు వరకు మాత్రమే పరిమితం. తెర వెనకాల ఉండే రష్మి వేరు. ఆమె రియల్ లైఫ్ తెలియాలంటే సోషల్ మీడియాలను రష్మిని ఫాలో అవ్వాల్సిందే. రష్మి జీవన శైలి ఎంతో భిన్నంగా ఉంటుంది. జీవ హింసపై పోరాడుతుంది.. మూగ జీవాల పరిరక్షణ కోసం పాటు పడుతూ ఉంటుంది.

anchor rashmi gautam about heroes and jawans
రష్మికి జై కొట్టిన నెటిజన్లు Rashmi Gautam
ఎక్కడ ఏ మూగజీవికి బాధ కలిగినా రష్మి స్పందిస్తుంది. తనకు చేతనైన సాయం చేస్తుంది. స్వచ్చంద సంస్థలతో పాటుగా సేవ కార్యక్రమాలుచేస్తుంటుంది. వీధి కుక్కల కోసం రష్మి ఎక్కువగా పాటు పడుతూ ఉంటుంది. వాటిని ఎవరైనా హింసిస్తుంటే సహించలేదు. ఆకలితో అలమటిస్తుంటే వాటికి అన్నం పెడుతుంది. అలా రష్మి ఎప్పుడూ కూడా సమాజం, జీవ రాశులు, ప్రకృతి, వాతావరణం ఇలాంటి విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.

anchor rashmi gautam about heroes and jawans
అయితే తాజాగా రష్మీ ఓ పోస్ట్ వేసింది. అసలు హీరోలకు నిజమైన అర్థమేంటో తెలిసేలా చేసింది. ఆ మధ్య పరేశ్ రావల్ ఓ ట్వీట్ వేశారు. సినిమాల్లో నటించే వారిని హీరోలు అనొద్దు.. వారిని ఎంటర్టైనర్ అని పిలవాలి. మన ఆర్మీ, సైనికులను హీరో అని పిలవాలి. ఎందుకంటే భావి తరాలకు హీరో అంటే సరైన అర్థం తెలియాలంటే మనం ఈ పని చేయాలి అని అన్నాడు. దీనికి రష్మీ స్పందించింది. అవును అది వంద శాతం కరెక్ట్ అని చెప్పుకొచ్చింది. మీలో ఎంత మంది దీంతో ఏకిభవిస్తారు అని రష్మి అడగడంతో అందరూ రష్మీ చెప్పినదానికే ఓటు వేసేశారు.