Bigg Boss 5 Telugu : యాంకర్ రవి ఎలిమినేషన్.. అసలు కారణం ఇదేనా?
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంటి నుంచి పన్నెండో వారంలో ప్రియాంక బయటకు వెళ్తుందనేది అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ప్రియాంక ఎలిమినేషన్ పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. మధ్యలో సిరికి కాస్త నెగెటివిటీ పెరగడం, అమ్మ చెప్పినా పద్దతి మార్చుకోకపోవడంతో సిరి డేంజర్ జోన్‌లోకి వచ్చేసింది. సిరి, ప్రియాంకలోంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు.
కానీ చివరి నిమిషంలో రవి ఎలిమినేట్ అయ్యాడని లీకులు వచ్చాయి. లీకు వీరులకు కూడా ఇది షాకింగ్‌లానే అనిపించింది. అంటే రవి ఎలిమినేట్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదన్న మాట. దీంతో రవి ఎలిమినేషన్ మీద వింత వాదనలు వచ్చాయి. రవి కావాలనే వెళ్లిపోయాడని కొందరు అంటున్నారు. అయితే బిగ్ బాస్ టీం కావాలనే రవిని బయటకు పంపించిందనే టాక్ వినిపిస్తోంది.

Anchor Ravi Elimination Shocks in Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu : రవి వెళ్లడానికి కారణం ఏంటి?
రవి ఇంత వరకే ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఫ్యామిలీ ఎపిసోడ్ వరకే ఉంటాను. ఫ్యామిలీ బిగ్ బాస్ ఇంట్లోకి వస్తే చాలు తరువాత వెళ్లిపోతాను అని అన్నాడట. అందుకే వెళ్లిపోయాడు అనే టాక్ వినిపిస్తోంది. లేడీ కంటెస్టెంట్లను సేఫ్ చేసేందుకు, ఇంట్లో ట్రాకులు నడిపించేందుకే ఆడవాళ్లను కాకుండా రవిని ఇంటి నుంచి బయటకు పంపించాడని అంటున్నారు. వీటిలో ఏది నిజమో బిగ్ బాస్ టీంకు, రవికే తెలియాలి.