Ashu Reddy : అషూ రెడ్డిని నలిపి పడేసిన యాంకర్ శివ.. రచ్చ మాములుగా లేదుగా..!
Ashu Reddy : బుల్లితెరపై ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న కార్యక్రమం బిగ్ బాస్. ఇన్నాళ్లు టీవీలో ప్రసారమైన ఈ షో ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. ఆరంభం నుంచే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ గత నెలలో ప్రారంభం అయింది. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఎక్కువగానే గొడవలు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో ఈ సీజన్ అంతకంతకూ రంజుగా మారుతూ అనుకున్న దాని కంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తోంది. యాంకర్ శివ, అషూ రెడ్డి, ముమైత్ ఖాన్ వంటా వారు చేస్తున్న సందడి వేరే రేంజ్‌లో ఉంది.
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంట్లోని సభ్యులకు ఫ్యామిలీ టాస్క్ ఇచ్చాడు. దీని ప్రకారం.. ఇంటి పెద్దగా నటరాజ్ మాస్టర్ తన కుటుంబాన్ని ఎంపిక చేసుకుని.. అసలు వాళ్లు ఎందుకు ఆ క్యారెక్టర్ చేయాలో వివరించాలి. అలా అందరినీ ఎంపిక చేసుకున్న తర్వాత ఫన్నీగా స్కిట్ చేయాలి అని బిగ్ బాస్ సూచించాడు. దీంతో ఆయన తనదైన కారణాలతో ఎంపిక చేసుకున్నాడు. ఇంటి పెద్దగా నటరాజ్ మాస్టర్‌ని బిగ్ బాస్ ఎంపిక చేయడంతో మిగిలిన క్యారెక్టర్స్‌ని అతనే డిసైడ్ చేశాడు. ముమైత్ (వైఫ్), అఖిల్ (పెద్ద కొడుకు), బిందు మాధవి (గయ్యాలి కోడలు), అజయ్ (చిన్న కొడుకు), అషురెడ్డి (పెద్ద కూతురు), హమీదా (చిన్న కూతురు),
Ashu Reddy : మాములుగా లేదు రచ్చ..
మహేష్ విట్టా (వంట మనిషి), స్రవంతి (చెల్లెలు), అనీల్ (స్రవంతి భర్త), బేవర్స్ కొడుకు (శివ-నటరాజ్ మేనల్లుడు) ఇలా రకరకాల పాత్రల్లో జీవించేశారు.తాగుబోతుగా నటించిన శివ తెగ అలరించాడు. ఫ్యామిలీ టాస్కులో అందరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. మరీ ముఖ్యంగా యాంకర్ శివ బేవార్స్ తాగుబోతు వాడిలా చాలా బాగా నటించాడు. తరచూ మధ్యలోకి వెళ్లి అందరితో గొడవ పడడం.. మరీ ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ లుంగీ పట్టుకుని లాగడం వంటి వాటిలో ఫన్ క్రియేట్ చేశాడు. ఈ పాత్ర ‘బాద్‌షా’ సినిమాలో బ్రహ్మానందం రోల్‌ను గుర్తు చేసేలా కనిపించింది. దొరికిందే ఛాన్స్ అని అషూ రెడ్డిని తెగ నలిపేశాడు శివ.