Alia Bhatt : కడుపుతో ఉన్న ఆలియా భట్.. తన షోలోనే బయటపెట్టించిన యాంకర్ సుమ

Authored By aruna | The Telugu News | Published on: September 6, 2022, 12:30 pm

Alia Bhatt : అలియా భట్ రణ్‌బీర్ కపూర్‌ల పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే. ఐదేళ్ల ప్రేమ.. పెళ్లిగా మారింది. పెళ్లిలో అలియా భట్ నవ్వులు అందరినీ ఆకట్టుకున్నాయి. పెళ్లి తరువాత మీడియా ముందుకు వచ్చిన ఈ జంట ఎంతో చూడముచ్చటగా అనిపించింది. అలియాను రణ్ బీర్ కపూర్ అందరి ముందే ఎత్తుకుని తీసుకెళ్లడం, అలానే ఫోటోలకు పోజులు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అలియా పెళ్లి కంటే ముందు ప్రెగ్నెంట్ అయిందనే వార్త ఒకటి చక్కర్లు కొట్టేసింది. పెళ్లైన రెండు నెలలకే అలియా భట్ కాస్త బేబీ బంప్‌తో కనిపించింది.

దీంతో రూమర్లన్నీ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. తాను తల్లిని అవుతున్నానంటూ అలియా భట్ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా స్పందించలేదు. ప్రకటించలేదు. బ్రహ్మాస్త్రం ప్రమోషన్స్‌లో భాగంగా అలియా భట్ ఎక్కడా కూడా ఈ విషయం మీద నోరు విప్పలేదు. ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి సమర్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం రాజమౌళి బాగానే కష్టపడుతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 9న రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు. అందులో భాగంగా సుమ క్యాష్ షోకు బ్రహ్మాస్త్రం టీం వచ్చింది.

Anchor Suma About Alia Bhatt Pregnancy in Cash Show

Anchor Suma About Alia Bhatt Pregnancy in Cash Show

ఇందులో సుమ బ్రహ్మాస్త్రం టీంను బాగానే ఆడుకుంది. ఇంత వరకు రాజమౌళి రమ్మంటే రాలేదు కానీ బ్రహ్మాస్త్రం సినిమా కోసం షోకు వచ్చాడని అంది. ఇక ప్రోమో చివర్లో తెలుగు సంప్రదాయాన్ని చూపించింది సుమ. కడుపుతో ఉన్న వాళ్లు వస్తే ఇలా ఇచ్చి పంపుతామని చీర, గాజులు,పూలు అన్నీ ఇచ్చింది. వాటిని చూసి అలియా భట్ తెగ మురిసిపోయింది. మొత్తానికి ఇలా అలియా భట్ ప్రెగ్నెంట్ అని అధికారికంగా సుమ తన షోలోనే కన్ఫామ్ చేసేసింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp