Anchor Suma : చివరి క్షణం వరకు అలా చేస్తూనే ఉంటాను.. సుమ కామెంట్స్ వైరల్
Anchor Suma యాంకర్ సుమకు బుల్లితెరపై ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసింది. మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో సుమకు ఎనలేని క్రేజ్ ఉంటుంది. స్టార్ మహిళా అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని లేడీస్‌కు దగ్గరైంది సుమ. ఎన్నో యేళ్ల నుంచి నిర్విరామంగా షోను హోస్ట్ చేస్తూ వచ్చిన సుమ.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేసింది. అయితే ఇదంతా ఒకెత్తు అయితే స్టార్ మహిళకు వచ్చిన కంటెస్టెంట్లు సుమపై ప్రేమను కురిపిస్తూ ఉండేవారు.

Anchor Suma about Star Mahila Contestants
సుమ కోసం వెరైటీ బహుమతులను తీసుకొచ్చేవారు. ప్రేమగా వండి వెరైటీ వంటకాలను తెచ్చేవారు.. సుమ కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన వస్తువులను ఇలా ఏదో ఒకటి తీసుకొచ్చి తమ ప్రేమను చాటే వారు. అలా తాజాగా కొంత మంది మహిళలను సుమపై ప్రేమను కురిపించారట. ఇదే విషయాన్ని చెబుతూ సుమ కూడా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎమోషనల్ వీడియో తెగ వైరల్ అవుతోంది.
స్టార్ మహిళ షోలో పాల్గొనేందుకు వచ్చిన కంటెస్టెంట్లు సుమ గురించి ఓ గిఫ్ట్‌ను ఇచ్చారు. అందులో సుమ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఆల్బమ్‌గా గడియారం చుట్టూ అమర్చారు. అయితే ఈ ప్రేమ గురించి చెబుతూ సుమ ఎమోషనల్ అయింది. ఇలా మా స్టార్ మహిళలు నాపై ప్రేమను కురిపిస్తున్నారు.. కానీ మీరు కురిపిస్తున్న ప్రేమను తిరిగి ఎలా ఇవ్వాలి ఫ్రెండ్స్.. నా చివరి క్షణం వరకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాను.. లవ్యూ ఆల్ అంటూ సుమ చెప్పుకొచ్చింది.
View this post on Instagram