Anchor Suma : అమెరికాలో సుమ కష్టాలు.. వీడియోలో యాంకరమ్మ వివరణ
Anchor Suma : యాంకర్ సుమ గత కొన్ని రోజుల నుంచీ అమెరికాలో విహరిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి తెలుగు సంఘాలు నిర్వహించే ప్రోగ్రాంలకు హోస్ట్‌గా ఉండేందుకు వెళ్లింది. ఇక అందులో భాగంగా సుమని వారు సత్కరించడం, రివార్డులు, అవార్దులు ఇవ్వడం అందరికీ తెలిసిందే. సుమతో పాటుగా, యాంకర్ రవి కూడా హోస్టింగ్ చేశాడు. యాంకర్ రవి కూడా తన ఫ్యామిలీని తీసుకెళ్లాడు. న్యూ యార్క్ నగరంలో అందరూ కలిసి తెగ సందడి చేస్తున్నారు. ఇక సుమ అయితే రకరకాల వీడియోలతో ఆకట్టుకుంటోంది. సుమ అక్కడి రెస్టారెంట్లలో తిరుగుతోంది. అక్కడి సర్వీసులను చూసి ఫిదా అయింది.
రోబోలోతో సర్వీస్ చేయిస్తున్నారంటూ సుమ ఓ వీడియోను వదిలింది. ఇక సుమ అక్కడి నడివీధుల్లో గెంతులు వేస్తోంది. సుమ తన గెటప్పును మార్చేసింది. ప్యాంటు, షర్టులతో సుమ రచ్చ చేస్తోంది.మొత్తానికి న్యూయార్క్ నడి వీధుల్లో సుమ వేసిన హళమితి హబిబో స్టెప్పులు, దానికి సంబంధించిన రీల్ వీడియో బాగానే వైరల్ అయింది. తాజాగా సుమ ఇప్పుడు తన కష్టాలను చెప్పుకొచ్చింది. దాన్ని కూడా ఓ రీల్ రూపంలో చెప్పింది. మన ఇండియన్స్‌కి ఓ అలవాటు ఉంటుంది. ఎక్కడకు వెళ్లినా సరే చాయ్ కావాల్సిందే. చాయ్ లవర్స్ ఎక్కువగా ఉంటారు. ఇక సుమ కూడా ఓ చాయ్ లవరే.
అయితే సుమకు మాత్రం అమెరికాలో ఓ మంచి చాయ్ దొరకడం లేదట. ఓ మంచి చాయి కోసం చావాల్సి వస్తోందని, అంతా వెదికానని, దొరకడం లేదంటూ సుమ చెప్పుకొచ్చింది. ఇక ఓ రెస్టారెంట్‌కు వెళ్లి.. ఎలాగోలా సంపాదించినట్టుంది.. ఈ రీల్ వీడియోలో సుమ చేసిన కామెడీ మాత్రం అదుర్స్. అమెరికాలో ఓ చాయ్ బండది పెట్టుకుంటే బాగానే సంపాదించుకోవచ్చట. టీ, కాఫీ కోసం వీళ్లు ఇచ్చే కప్పుల్లో స్విమ్మింగ్ పూల్ చేయొచ్చట.. కుడి పోసేంత కప్పు సైజ్ ఉందని, కౌంటర్లు వేసింది. మొత్తానికి సుమ మాత్రం అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇక్కడ సుమ లేకపోవడంతో ఎన్నో ఈవెంట్లు వెలవెలబోతోన్నాయి. సుమ రాక కోసం ఈవెంట్లు ఎదురుచూస్తున్నాయి.
View this post on Instagram