Anchor Suma : ఎవడ్రా నీకు ఆంటీ.. నరేష్ మీద యాంకర్ సుమ ఫైర్
Anchor Suma : యాంకర్ సుమ బుల్లితెరపై చేసే హంగామా మామూలుగా ఉండదు. తన ముందున్నది ఎవ్వరు అనేది కూడా చూడదు. పంచ్‌లు వేస్తే అవతలి వాళ్లు కౌంటర్లు వేయడానికి ఇంకేం ఉండదు. అయితే సుమ బుల్లితెరపై దశాబ్దానికిపైగా అప్రతిహతంగా దూసుకుపోతోంది. సుమ ఇప్పుడు ఎక్కువగా సినిమా ఈవెంట్ల మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. బుల్లితెరపై ఆమె కనిపించడం చాలా వరకు తక్కువ చేసింది. బుల్లితెరపై ఒకప్పుడు అన్ని చానెళ్లలో కనిపించేది. జీ తెలుగు, స్టార్ మా, ఈటీవీ ఇలా అన్నింట్లోనూ కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క ఈటీవీలోనే కనిపిస్తోంది. అది కూడా క్యాష్ షోను మాత్రమే చేస్తోంది.
సుమ చేతిలో ఉన్న ఏకైక ఎంటర్మైన్మెంట్ ప్రోగ్రాం అది. ప్రతీ శనివారం సుమ తన అభిమానులను క్యాష్ షో ద్వారా పలకరిస్తోంది. ఒకప్పుడు గెస్టులను పిలవడంలోనూ వైవిధ్యత ఉండేది. కానీ ఇప్పుడు సినిమా ప్రమోషన్లకే ఎక్కుగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుంది. గత వారం బ్రహ్మాస్త్రం టీం గెస్టుగా వచ్చింది. మొదటి సారిగా రాజమౌళి ఇలా ఓ షోకు వచ్చాడు. దాంతో ఒక్కసారిగా క్యాష్ షో నేషనల్ టాపిక్ అయింది. ఇక ఇప్పుడు క్యాష్ షోలో జబర్దస్త్ గ్యాంగ్ వచ్చింది. గడ్డం నవీన్, బాబు, బుల్లెట్ భాస్కర్, నరేష్ ఇలా కమెడియన్ల గ్యాంగ్ అంతా కూడా వచ్చారు.
అయితే ఇందులో నరేష్ మీద సుమ వరుసగా పంచులు వేసింది. మామూలుగానే నరేష్ అంటే సుమ దారుణంగా కౌంటర్లు వేస్తుంటుంది. మీ అందరికీ రూల్స్ తెలుసు కదా? అని సుమ అంటే.. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి అని నరేష్ అంటాడు.నువ్వే ఇంత పాత బడుతున్నావ్ ఇంకా కొత్తగా ఏం చెప్పాలి అని అంటుంది సుమ. నీవు ఇంతే ఉంటున్నావ్ కానీ వయసు మాత్రం బాగానే పెరుగుతోంది అని సుమ కౌంటర్ వేస్తుంది. వయసు కాదు మేడం.. అనుభవం అని నరేష్ నాటీగా అంటాడు. మరో సందర్భంలో సుమ ఓ స్కిట్ వేసింది. అందులో ఓకే ఆంటీ అని నరేష్ అంటాడు. ఎవడ్రా నీకు ఆంటీ.. ఇలాంటి కామెడీలు చేయొద్దని చెప్పాను కదా? అని సుమ కౌంటర్ వేస్తుంది. దీంతో నరేష్ సైలెంట్ అయిపోతాడు.