Anchor Suma : ఫైవ్ స్టార్ హోటల్‌లో అలాంటి పనులు.. యాంకర్ సుమ మామూల్ది కాదు
Anchor Suma యాంకర్ సుమ Anchor Suma ప్రస్తుతం ఎక్కడ ఉందో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా మాల్దీవుల్లో సుమ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్యామిలీతో కలిసి ఈ వెకేషన్‌ను బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. అక్కడకి వెళ్లినా కూడా తన ఫాలోవర్లను మాత్రం ఎంటర్టైన్ చేయడకుండా వదలడం లేదు. రకరకాల వీడియోలను షేర్ చేస్తూ అందరినీ నవ్విస్తోంది. అయితే తాజాగా రియాల్టీకి, పోజులు కొట్టడానికి మధ్య ఉన్న తేడాను చూపించింది.
Anchor Suma Fun In Maldives Five Star Hotel
హోటల్ బాత్రూంలో సుమ రచ్చ..Anchor Suma
ఆ మధ్య కూడా ఇలాంటి వీడియోలను సుమ షేర్ చేసింది. అందరూ చూస్తుంటే ఎలా తింటాం.. ఎవ్వరూ లేకపోతే, చూడకపోతే ఎలా తింటాం అంటూ కొన్ని వీడియోలను షేర్ చేసింది. ఇప్పుడు కూడా అలాంటి ఓ వీడియోను షేర్ చేసింది. మాల్దీవులకు వెళ్లిన సుమ అక్కడ ఓ ఫైవ్ స్టార్‌లో బస చేసినట్టుంది. ఇక ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఎలాంటి సౌకర్యాలు, ఎంత విలాసవంతంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఫైవ్ స్టార్ హెటల్‌లోని బాత్రూంలో సుమ చేసిన అల్లరి మామూలుగా లేదు.
మామూలు ఇలా షో ఆఫ్ చేస్తుంటామని ముందు ఒక వీడియోను షేర్ చేసింది. అందులో బాత్రూం అద్దాల ముందు నిల్చుని స్టైలీష్‌గా మేకప్ వేసుకుని, ఇంగ్లీష్‌లో మాట్లాడింది. కానీ అసలు ఒరిజినాలిటీ ఎలా ఉంటుందనేది మళ్లీ చూపించింది. అద్దాల ముందున్న సింకులో బట్టలు పిండేసి ఇంట్లో ఎలా ఉంటారో అలా, ఏం చేస్తారో అలా చేసేసింది. మొత్తానికి సుమ షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక సుమ త్వరలోనే అక్కడి నుంచి తిరిగి వస్తుందట.
View this post on Instagram