Anchor Suma : రాజమౌళి చేత గిల్లించుకున్న సుమ.. యాంకర్ వీడియో వైరల్
Anchor Suma : యాంకర్ సుమకు రాజమౌళికి ఉన్న సన్నిహిత బంధం గురించి తెలిసిందే. రాజీవ్ కనకాల సుమ రాజమౌళి ఎన్టీఆర్ ఇలా అందరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తుంటారు. ఇక వీరంతా ఒక చోటకు చేరితే అక్కడంతా సందడి వాతావరణమే ఉంటుంది. రాజమౌళి అయితే ఎప్పుడూ కూడా సుమ గురించి ఎంతో గొప్పగా చెబుతుంటాడు. సుమకు భయపడ్డట్టు రాజమౌళి నటిస్తుంటాడు. సుమ మాత్రమే తమ ఈవెంట్లు చేయాలని రాజమౌళి పట్టుబడుతుంటాడు.
అలా జయమ్మ పంచాయితీ సినిమా ఈవెంట్‌లో రాజమౌళి ఇచ్చిన వీడియో బైట్, అందులో ఆయన చెప్పిన మాటలు, సుమ మీద వేసిన కౌంటర్లు అందరికీ తెలిసిందే. తాను రాలేదని, తన సినిమా ఈవెంట్లకు ఎగ్గొట్టొదని సుమను దర్శక ధీరుడు వేడుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి కోసం సుమ వచ్చేసింది. నిన్న బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ ఎంత గందరగోళంగా జరిగిందో అందరికీ తెలిసిందే. లేట్ నైట్ ఈ ఈవెంట్ జరిగినా కూడా సుమ వచ్చింది. రాజమౌళి కోసం సుమ బాగానే ఆలస్యమైనా కూడా ఉంది.

Anchor Suma Fun With Rajamouli in Cash Show Promo
ఇక రాజమౌళి ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఎన్నడూ బుల్లితెరపై కనిపించని దర్శకధీరుడు రాజమౌళి ఓ షోకు వచ్చాడు. సుమ క్యాష్ షోలో రాజమౌళి, అలియా భట్, రణ్‌బీర్ కపూర్ వచ్చారు. ఫ్లాప్‌లు తన దరికి చేరవని, ఫ్లాపులనే ఫ్లాపులు చేశాడంటూ రాజమౌళిని పిలిచింది సుమ. ఇక రాజమౌళి వచ్చాడనేది కలనా? నిజమా? తెలుసుకునేందుకు ఒకసారి గిల్లండి అని రాజమౌళిని అడుగుతుంది సుమ. దీంతో సుమను గిల్లేస్తాడు రాజమౌళి. నిజమే నిజమే అని సుమ గాల్లో తేలుతుంది.