Anchor Suma : భర్తతో గొడవలు వస్తాయనుకుందా?.. షోలో భయపడ్డ యాంకర్ సుమ
Anchor Suma : బుల్లితెరపై యాంకర్ సుమ ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి సుమ ఇప్పుడు వెండితెరపైనా దూసుకుపోతోంది. జయమ్మ పంచాయతీ అంటూ సుమ లీడ్ రోల్‌లో చేస్తోన్న సినిమా ప్రమోషన్స్‌లో మరింత బిజీగా మారింది. ఇక వెబ్ సిరీస్‌ల్లోనూ సుమ నటించేస్తోంది. అయితే తాజాగా సుమ హోస్ట్ చేస్తోన్న క్యాష్ షో ఓ అనుకోని ఘటన ఎదురైంది.
ఆ షోకు బుల్లెట్ భాస్కర్, రాం ప్రసాద్, విష్ణుప్రియ, మేఘనలు పేరెంట్స్‌ను తీసుకొచ్చారు. భాస్కర్, రాం ప్రసాద్ వాళ్ల నాన్నలతో వచ్చారు. మేఘన, విష్ణుప్రియ తమ తల్లులతో వచ్చారు. అయితే ఈ షోలో ఓ టాపిక్ నడిచింది. తండ్రి గొప్పదా? తల్లి గొప్పదా? అనే టాపిక్ నడిచింది. ఇందులో అందరూ వాదించుకుంటూ చివరకు సుమ సంసారానికి ఎసరు పెట్టారు.

Anchor Suma Gets Afraide Rajeev Kanakala Topic In cash Show
Anchor Suma : షోలో సుమ షాక్..
ఆడవాళ్లే గొప్ప.. 80 శాతం మాదే ఉంటుంది అని విష్ణుప్రియ అమ్మ అంటుంది. అంటే లెక్కలు వేసుకుని వచ్చారా? అంటూ రాం ప్రసాద్ పంచ్ వేస్తాడు. అందులోకి సుమను కూడా లాగారు. దీంతో బుల్లెట్ భాస్కర్ తండ్రి ఏకంగా రాజీవ్ కనకాలను లాక్కొచ్చాడు. సుమ అలా అయితే రాజీవ్ కనకాల ఏంటన్నట్టుగా ప్రశ్నించాడు. దీంతో టాపిక్ ఎక్కడికో వెళ్తోందనే భయంతో అక్కడికి ఆపేసింది సుమ. మొత్తానికి సుమ సంసారమే అతుకుల బొంతగా ఉన్న సమయంలో ఇలాంటి చర్చలు అవసరమా? అనుకుందేమో.
