Anchor Suma : షోలో అందరి ముందే యాంకర్ సుమకి ప్రపోజ్ చేసేశాడు.. జబర్దస్త్ కమెడియన్‌కు షాక్ ఇచ్చిన యాంకర్
Anchor Suma : బుల్లితెరపై సుమ చేసే సందడి మాములుగా ఉండదు. పలు టీవీ షోస్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సుమ ప్రస్తుతం జయమ్మ పంచాయతీ అనే సినిమాతో వెండితెరపై రచ్చ చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. వరుస షోలు చేస్తూ బుల్లితెర మహారాణిగా పేరు తెచ్చుకున్న సుమ వీలు చిక్కినప్పుడల్లా కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే ఈసారి సహాయక పాత్రల్లో కాకుండా ఏకంగా లీడ్ రోల్‌లో నటించింది సుమ. విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాశ్ నిర్మించారు.సుమ.. ఎక్కువశాతం బుల్లితెరకే పరిమితమయింది. కానీ అప్పుడప్పుడు వెండితెరపై కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.
ఎప్పుడూ ఈవెంట్లతో, ప్రోగ్రామ్‌లతో బిజీగా ఉండే సుమ.. ఇటీవల జయమ్మ పంచాయతి అనే చిత్రంలో నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్‌తో పాటు ఓ పాట కూడా విడుదలయ్యింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే యాంకర్‌లలో స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుమ.. ఒక్కొక్క ఈవెంట్ కోసం రూ. 1 నుండి 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందని టాక్. అయితే తన బిజీ షెడ్యూల్‌లో టైమ్ తీసుకుని జయమ్మ పంచాయతి సినిమాలో నటించిన సుమ.. ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 50 లక్షలు డిమాండ్ చేసిందట.సుమ చేస్తున్న పాపులర్ షోస్‌లో స్టార్ మహిళ, క్యాష్ ఒకటి.

Anchor Suma warns to Jabardasth Naresh
Anchor Suma : సుమ వార్నింగ్‌కి బిత్తరపోయిన నరేష్..
స్టార్ మహిళకి తాత్కాలికంగా బ్రేక్ వేసిన క్యాష్ మాత్రం సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. అయితే తాజా ఎపిసోడ్‌కి బుల్లితెర ఆర్టిస్ట్‌లు హాజరయ్యారు. జబర్ధస్త్ షోలో ఫన్ క్రియేట్ చేసే నరేష్, ఫైమా, బషీర్, యోధ వంటి వారు కూడా షోలో పాల్గొన్నారు. అయితే నరేష్ ఈ షోలో ఏకంగా సుమకే ప్రపోజ్ చేశాడు. రెడ్ రోజ్ అందించడం, బెలూన్స్ విసరడం వంటివి చేశాడు. అయితే నరేష్.. సుమకి ప్రపోజ్ చేసిన క్రమంలో ఆమె వార్నింగ్ ఇస్తూ.. మా ఆయన వచ్చాడంటే నిన్ను ఇక్కడే పాతిపెట్టి దానిపైన ఈ పువ్వు పెడతాడని పంచ్ వేసింది. ఈ వీడియో వైరల్‌గామారింది.
