Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ గురించి యాంకర్ శ్యామల కామెంట్లు వైరల్.. తిట్టిందా? పొగిడిందా?
Ram Gopal Varma : వివాదాలకు కేరాఫ్ గా నిలిచే డైరెక్టర్ ఎవరని అడిగితే.. చిన్న పిల్లోడు కూడా ఎలాంటి అనుమానం లేకుండా రాంగోపాల్ వర్మ పేరు చెప్పే్స్తాడు. తన ట్వీట్లు, కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ.. హీరోలు, హీరోయిన్లు, యాంకర్ల మీద కామెంట్లు చేస్తుంటాడు. అప్పుడప్పుడు పొలిటికల్ వ్యవహారాల్లోనూ వేలు పెట్టే ఆర్జీవీ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.తన అందంతో పాటు యాంకరింగ్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ శ్యామల. ఎంతో పద్ధతిగా యాంకరింగ్ చేసే ఆమె మీద ఈ మధ్యన రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లు అందరికీ తెలిసిందే.
ఓ సినిమా ఫంక్షన్ లో స్టేజ్ మీదే శ్యామలను చూస్తూ.. ‘ఇంత అందంగా ఉన్నావ్.. ఇన్నాళ్లు నాకు కనపడకుండా ఎక్కడున్నావ్’ అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లు అందరికీ నవ్వు తెప్పించాయి.ఇలా శ్యామల, ఆర్జీవీల మధ్య సాగిన ఎపిసోడ్ తో కాస్త వైరల్ కాగా.. ఈ మధ్యన శ్యామల సోషల్ మీడియాలో కొందరు నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. పనిలో పనిగా ఆర్జీవీ గురించి అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పింది. ఆర్జీవీ గురించి ఏమైనా చెప్పండని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం వైరల్ అయింది.ఆర్జీవీ గురించి చెప్పండన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..

Anchor Syamala comments about Ram Gopal Varma
Ram Gopal Varma : నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం..
నో కామెంట్.. కానీ ఆయన ఓ గొప్ప దర్శకుడు.. ఒకప్పుడు వర్మ చిత్రాలకు నేను పెద్ద అభిమానిని అంటూ శ్యామల చెప్పుకొచ్చింది. దీంతో ఇంతకీ గొప్ప డైరెక్టర్ అంటూ పొగిడిందా లేదంటే ఈమధ్యన ఆర్జీవీ తీస్తున్న సినిమాలు బాగోలేవని చురకలు అంటించిందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మొత్తానికి శ్యామల చేసిన కామెంట్లు.. ఓ కోణంలో ఆర్జీవీని పొగిడినట్లు ఉండే, మరోకోణంలో కౌంటర్ వేసినట్లు