Anchor varshini : అప్పటి వరకు అలా చేయాల్సిందేనా?.. యాంకర్ వర్షిణి మంచి మనసు
Anchor varshini : యాంకర్ వర్షిణి.. బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ బుల్లితెరపై కనిపించిందంటే చాలు అభిమానులకు పండగే. తన అందంతో, ముద్దు ముద్దు మాటలతో వర్షిణి.. అభిమానుల గుండెల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కొన్ని సార్లు తనపై వేసిన పంచ్‌లను కూడా ఆమె లైట్ తీసుకుంటుంది. ఇక, ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. పటాస్-2, ఢీ, కామెడీ స్టార్స్‌లో కనిపించిన ఈ భామ భారీగానే క్రేజ్ తెచ్చుకుంది. ఓవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లలో కూడా సందడి చేస్తుంది.

Anchor varshini gives shelter to baby dog
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన హాట్ లుక్స్‌తో కుర్రకారు గుండెల్లో నిద్రలేకుండా చేస్తాయి. ఆమె షేర్ చేసే కొన్ని ఫొటోల్లో గ్లామర్ డోస్ భారీగా దట్టిస్తుంది. అయితే పలు సందర్బాల్లో యాంకర్ వర్షిణి తన మంచి మనసును చాటుకున్నారు. తాజాగా వర్షిణి ఇన్‌స్టా స్టేటస్ చూసిన ఫ్యాన్స్.. ఆమెది చాలా జాలి గుండె అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వర్షిణి కూడా యాంకర్ రష్మీ బాటలోనే నడుస్తోన్నట్టు కనిపిస్తోంది.
Anchor varshini : మంచి మనసును చాటుకున్న వర్షిణి

Anchor varshini gives shelter to baby dog
ఇంతకీ వర్షిని ఏం చేసిందని అనుకుంటున్నారు. ఓ కుక్క పిల్లకు షెల్టర్ ఇచ్చింది. అది కోలుకునేవరకు షెల్టర్ ఇవ్వనున్నట్టుగా తెలిపింది. ‘నా ఇంటికి ఊహించని గెస్ట్ వచ్చింది. దానికి బాగోలేదు. అది కోలుకునే వరకు షెల్టర్ ఇస్తాను’ అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా వర్షిణి షేర్ చేసింది. ఇది చూసిన జనాలు వర్షిణి మంచి మనసును ప్రశంసిస్తున్నారు. యాంకర్ రష్మీ కూడా ఇలానే పెట్స్ పట్ల జాలిని చూపిస్తుంటుంది.