Home » Entertainment » Anil Ravipudi Pan India Movie With Allu Arjun
Entertainment

Allu arjun : అల్లు అర్జున్ కి సక్సస్ ఫుల్ డైరెక్టర్.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అంటే అనుమానాలు..?

Authored By
vamana sai
The Telugu News | Published on: April 7, 2021, 6:00 am
Advertisement

Allu arjun : అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్. అంటే ఇంకా ఒక్క పాన్ ఇండియన్ సినిమా కూడా అల్లు అర్జున్ నటించింది రాలేదు. కానీ క్రేజ్ మాత్రం ఆ రేంజ్ లో అల వైకుంఠపురములో సినిమాతో వచ్చింది. గత ఏడాది నుంచి అల వైకుంఠపురములో సినిమా పాటలు ట్రెండ్ అవుతూ మిలియన్స్ వ్యూస్ రాబడుతూనే ఉన్నాయి. దేశ విదేశాలలో అల సునామీ ఆగడానికి చాలా సమయం పట్టింది. నిజంగా ఈ సినిమాని గనక తెలుగుతో పాటు హిందీ, తమిళం,మలయాళ, కన్నడ భాషల్లో గనక రిలీజ్ చేసి ఉంటే పాన్ ఇండియన్ స్టార్ అయ్యేవాడు.

Advertisement

Anil Ravipudi Pan India Movie With Allu Arjun

అయినా ఇక ఆలస్యం చేయకూడదని సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం,కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 13న పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేశారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

Allu arjun : అనిల్ రావిపూడి పాన్ ఇండియన్ సినిమా చేయగలడా..?

కాగా ఇప్పుడు మరో సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి పటాస్ సినిమా నుంచి సరిలేరు నీకెవ్వరు వరకు వరసగా సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు పాన్ ఇండియన్ సినిమా చేయలేదు. అన్నీ కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ మాత్రమే. దాంతో అల్లు అర్జున్ తో అనిల్ రావిపూడి పాన్ ఇండియన్ సినిమా చేయగలడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి