Sreemukhi : పిలిచి పరువుతీయించుకుంది.. తెల్లమొహం వేసిన శ్రీముఖి
Sreemukhi : శ్రీముఖికి బుల్లితెరపై ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఉండేది. క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉండే యాంకర్‌గా శ్రీముఖి మంచి స్టార్డంను సొంతం చేసుకుంది. అయితే బిగ్ బాస్ షో అనంతరం శ్రీముఖికి సరైన షోనే పడలేదు. శ్రీముఖి ఏ షో చేసినా కూడా వర్కవుట్ అవ్వడం లేదు. మధ్యలోనే ఆ షోను ఎత్తేయడం జరుగుతోంది.
అయితే ఇప్పుడు శ్రీముఖికి పటాస్ వంటి షో ఒకటి వచ్చింది. జాతి రత్నాలు అంటూ కామెడీ షోతో శ్రీముఖి వచ్చేసింది. అయితే ఇందులో ముందుగా పోసాని, బద్రం, కృష్ణ భగవాన్, అన్నపూర్ణమ్మ వంటి వారు వచ్చారు. ఇందులో శ్రీముఖికి అన్నపూర్ణమ్మ వేసిన పంచులు మాత్రం మామూలుగా లేవు.

Annapoornamma Satires On Sreemukhi In Jathi Ratnalu
Sreemukhi : శ్రీముఖికి పంచులే పంచులు..
టీవీలో ఉన్న వాళ్లు శ్రీముఖిని రాములమ్మ, రాములమ్మ అని అంటారని తెలుసు ఆవిడకి.. కానీ టీవీల ముందు కూర్చున్న వారు మాత్రం రావొద్దమ్మా రావొద్దమ్మా అని అంటారు.. అని అన్నపూర్ణమ్మ సెటైర్ వేసింది. దీంతో శ్రీముఖి తెల్లమొహం వేసింది. నిన్ను ఆర్ఆర్ఆర్ సినిమాకు అడగలేదా? నువ్ మాట్లాడితే ఆర్ఆర్ వేసినట్టుంది కదా? నిన్ను పిలవలేదా? అని తన సౌండ్ గురించి కౌంటర్ వేసింది